తేనె శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. అనేక రకాల ఔషధ గుణాలు తేనెలో ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు తేనెలో ఉండడం వలన తేనె మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇక ఖర్జూరం విషయానికి వస్తే ఇందులో విటమిన్ బి1, బి2, బి5, ఎ మరియు సి తో పాటు ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్ మరియు అధిక మొత్తంలో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ మరియు కాపర్‌ను కలిగి ఉంది. ఇందులో ఉండే ఫైబర్ పేగులను శుభ్రం చేస్తుంది. పేగులకు అంటుకుని ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. ఇందులో అధిక శాతం పొటాషియం ఉండడం వలన ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నరాల వ్యవస్తను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత బారినుంచి కాపాడుతుంది. రక్తపోటుని కంట్రోల్‌లో ఉంచుతుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉన్న బి5 చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇన్ని ప్రయోజనాలున్న తేనె, ఎండు ఖర్జూరాలను కలిపి తింటే మరిన్ని లాభాలు చేకూరుతాయి. ఓ సీసాలో మూడొంతుల తేనె, ఒక వంతు గింజ తీసిన ఎండు ఖర్జూరాలను వేయాలి. వీటిని తేనెలో బాగా కలిసేలా కలిపి మూత పెట్టి వారం రోజులు కదలకుండా ఉంచాలి. వారం రోజుల తరువాత రోజుకు రెండు స్పూన్ల చొప్పున తినడం వలన కలిగే ప్రయోజనాలు..దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఈ మిశ్రమం మంచి ఫలితాన్ని ఇస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది. క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండడంతో రక్త హీనతను తగ్గించి, ఎముకలను బలంగా చేస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
మలబద్ధకంతో బాధపడేవారికి మంచి ఫలితం కలుగుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది. కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నివారిస్తుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు.
The post ఎండు కర్జూరాన్ని తేనెలో నానబెట్టి తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్యఫలితాలు, అవేంటో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Oi6skM


No comments:
Post a Comment