ఉదయం టిఫిన్‌కి ఓ ప్లేట్ పూరీ.. ఓ ప్లేట్ వడ తినేస్తే కొలెస్ట్రాల్ పెరక్క ఏమవుతుంది. మరి దాన్ని తగ్గించుకోవాలంటే అలా నూనెలో ముంచి తీసే పదార్థాలు కాస్త పక్కన పెట్టి ఓ గుప్పెడు బాదంకి చోటిస్తే గుండె గట్టిగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. పిల్లలనుంచి పెద్దల వరకు తినగలిగే బాదం డైరక్టుగా తినకుండా రాత్రి పూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్ని వలిచి తింటే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. రోజూ క్రమం తప్పకుండా బాదం తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్-ఇ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, రైబోప్లోవిన్, మాంగనీస్, కాపర్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి.
రోజూ గుప్పెడు అంటే దాదాపుగా ఓ 20 బాదం గింజలను స్నాక్స్‌గా తీసుకుంటే 161 కెలోరీల శక్తి శరీరానికి అందుతుంది. 2.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అందుతాయి. వీటిలో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్, ప్రొటీన్లు, మరిన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంతో కణాలు దెబ్బకుండా కాపాడుతుంది. స్మోకింగ్ చేసేవారు బాదం గింజలు తింటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. బాదంలో విటమిన్-ఇ అధిక మోతాదులో ఉండడంతో గుండె జబ్బులు, కేన్సర్, అల్జీమర్స్ ముప్పు బారినుంచి తప్పించుకోవచ్చు.రక్తంలోని చక్కెర స్థాయిలను బాదం నియంత్రిస్తుంది. వీటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. రక్తంలోని ఎల్డీఎల్ లిపోప్రొటీన్స్‌ను బాదం తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఫలితంగా గుండె జబ్బుల బారి నుంచి తప్పించుకోవచ్చు.
కనీసం 8 గంటల పాటు నీటిలో నానబెట్టిన బాదంని వలిచి మాత్రమే తినాలి. లేదంటే తొక్కలో ఉండే టానిన్లు అందులోని పోషకాలు శరీరంలోకి ఇంకకుండా అడ్డుకుంటాయి. రోజూ తీసుకోవడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. బాదంలో విటమిన్ ఇ ఉన్న కారణంగా ఇవి తీసుకోవడం వలన వయసు మీద పడ్డ ఛాయలు చర్మం మీద కనిపించకుండా ఉంటాయి. ముడతలు పడకుండా నివారించే గుణం బాదంలో ఉంటుంది. బరువు తగ్గడంలో బాదం ప్రముఖ పాత్ర వహిస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలు అధికంగా అందడం వలన ఆకలి తగ్గుతుంది. దాంతో తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. ఎక్కువ తినేస్తేనే కదా బరువు పెరిగేది. మరి తగ్గాలంటే బాదం తప్పనిసరిగా తీసుకోవాలి. డయాబెటిస్ సమస్యలు తగ్గించడంతో పాటు మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే గుణం బాదంలో ఉందని పోషకాహార నిపుణులు కనుగొన్నారు.
The post బాదం.. పొట్టుతో పాటు తీసుకుంటే..!! ఎన్ని లాభాలో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2OimhrI


No comments:
Post a Comment