ఇంతకు ముందు ఇళ్లలో చిన్న చిన్న ఫ్రిజ్‌లు ఉండేవి. పాలు, పెరుగు, పండ్లు పెట్టుకోడానికి ఉపయోగకరంగా ఉండేవి. రాను రాను ఫ్రిజ్‌ల సైజు పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరిళ్లలో చూసినా డబుల్ డోర్ ఫ్రిజ్‌లు డబుల్ సైజుల్లో దర్శనమిస్తున్నాయి. డోర్ ఓపెన్ చేస్తే పడిపోతాయేమో అన్నంతగా ప్రతిదీ పెట్టేస్తుంటారు. ఆ రోజు వండిన పదార్ధాలు కొన్నైతే, వారం పది రోజులకు సరిపడా తెచ్చుకున్న కూరగాయలు కొన్ని ఉంటాయి. మొత్తానికి ఫ్రిజ్ ఫుల్లు. మరి ఫ్రిజ్‌లో పెట్టినా కొన్ని పాడైపోతుంటాయి. ఎందుకో అర్థం కాదు. అవి ఎందుకు పాడవుతాయో.. ఎందుకు పెట్టకూడదో తెలుసుకుందాం. ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని వాటిని గురించి సూచిస్తున్నారు నిపుణులు.
టొమాటొ
టొమాటొను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టొద్దంటున్నారు. చల్లదనానికి పై పొర పాడైపోతుంది. అందుకని బయటే ఉంచడం మంచిది.
చిల్లీ హాట్ సాస్
చిల్లీ హాట్ సాస్‌ని ఫ్రిజ్‌లో పెడితే వాటిలో నిల్వ ఉండడానికి వాడిన ఫ్రిజర్వేటివ్‌లో రసాయన చర్య సంభవించి వాటిలో ఫంగస్ ఏర్పడుతుంది.
మునక్కాడలు:
మునక్కాడలను పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వాటిలోని తేమ అంతా పోయి గట్టిగా తయారవుతాయి. వాటిని తీసి వండినా సారం లేక రుచిగా ఉండవు. అందువల్ల సాధారణ గది ఉష్ణోగ్రతలో ఉంచడం మేలు.
వెల్లుల్లి
వెల్లుల్లి రెబ్బలను గానీ, పాయలను గానీ ఫ్రిజ్‌లో ఉంచితే తేమ వల్ల పాడైపోతాయి.
తేనె
తేనెను ఫ్రిజ్‌లో ఉంచితే చల్లదనానికి తేనె చిక్కబడి అందులోని చక్కెర కణాలన్నీ ఉండల్లా చుట్టుకుని తేనె చిక్కగా మారుతుంది.
కీర దోస
కీర దోస ను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. చల్లదనాన్ని ఇది అసలు తట్టుకోలేదు. దాంతో మెత్తబడిపోయి రెండు మూడు రోజుల్లోనే పనికి రాకుండా పోతాయి. బయట పెడితే కొన్ని రోజులైనా బావుంటాయి.
ఉల్లిపాయలు
ఉల్లిపాయలు ఫ్రిజ్‌లో ఉంచితే మెత్తబడతాయి. ఆఖరికి కట్ చేసినవి కూడా పెట్టకూడదు. బయట కూడా కట్ చేసినవి నిల్వ ఉంచకుండా వెంటనే వండేయాలి.
నట్స్
బాదం, వాల్ నట్స్, ఎండు ఖర్జూరాలు వంటి నట్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచితే వాటిలోని ఆయిల్ కంటెంట్ అంతా పోయి రుచిని కోల్పోతాయి. అందుకని గాలి చొరబడిని డబ్బాలో వీటిని నిల్వ ఉంచాలి.
మామిడి పండ్లు
పండని మామిడి కాయలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. చల్లదనం కారణంగా కాయ త్వరగా పండదు. అందువలన పండిన కాయలను కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
బ్రెడ్
ఫ్రిజ్‌లోని చల్లదనానికి బ్రెడ్‌లోని పిండి పదార్ధం చక్కెరగా మారి దాని సహజ రుచిని కోల్పోతుంది. దాంతో త్వరగా పాడైపోతుంది.
పుచ్చకాయ
పుచ్చకాయను బయటే ఉంచాలి. కోసిన ముక్కలను పెట్టుకోవచ్చు.
ఆలూ (బంగాళ దుంప)
ఆలుగడ్డలోని పిండి పదార్ధం చక్కెరగా మారుతుంది. దాంతో రుచిని కోల్పోతుంది. రంగు కూడా మారిపోతుంది. అందుకే ఆలూని బయట వెలుతురు పడని ప్రదేశంలో నిల్వ ఉంచాలి.
అరటి పండ్లు
అరటి పండ్లు అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. సరిగా పండవు సరికదా పైన తోలు నల్లగా అయిపోతుంది. పైగా రుచిని కూడా కోల్పోతాయి.
అయినా వీలయినంత తక్కువగా కూరగాయలను, పండ్లను ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. ఫ్రెష్‌గా తింటేనే ఆరోగ్యం.
The post ఫ్రిజ్ లో వీటిని ఉంచి తింటున్నారా అవి విషం తో సమానం, అవేంటో తెలుసా …! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2HPjcya
No comments:
Post a Comment