etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, March 31, 2019

ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం, మంగళగిరి పర్యటనలో షర్మిలకు షాక్‌, వైరల్ వీడియో

వైసీపీ ప్రచార కార్యక్రమంలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు వందలాది మంది కార్యకర్తల సమక్షంలో అందరూ చూస్తుండగానే షర్మిల చేతి ఉంగరాన్ని కొట్టేశారు. ఈ ఘటనతో షర్మిల షాక్‌కు గురయ్యారు. షర్మిల మూడు రోజుల క్రితం రాజధానిలోని తాడేపల్లి ప్రాంతం నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. రెండు రోజుల క్రితం మంగళగిరిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆమె ప్రయాణిస్తున్న బస్సును చుట్టుముట్టారు. వారి అత్యుత్సాహం చూసిన షర్మిల చేయి ఊపుతూ అభివాదం చేశారు. పలువురు కార్యకర్తలకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. ఇదే అదనుగా గుంపులో ఉన్న ఓ అగంతకుడు ఆమె ముంజేతిని గట్టిగా పట్టుకుని, మరోచేత్తో వేలుకున్న ఉంగరాన్ని లాగేశాడు.

షర్మిల చేయి విడిపించుకునేందుకు ప్రయత్నించినా.. ఆ వ్యక్తి మాత్రం ఉంగరం కాజేశాడు. దీంతో ఆమె షాక్‌కు గురయ్యారు. పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘటన జరగడంతో ఆమె ఎవరికీ చెప్పుకోలేకపోయారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ వ్యవహారాన్ని ఓ కార్యకర్త సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో, ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకోవాల్సిందిగా గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు సీసీఎస్‌ పోలీసులను ఆదేశించారు. కాగా, ఈ తరహా నేరాల్లో తాడేపల్లి దొంగలు ఆరితేరారని అంటున్నారు. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యనేతల జేబులు సైతం వారు కొట్టేసిన ఘటనలు ఉండడంతో పోలీసులు ఈ దిశగా దృష్టిసారించారు.

The post ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం, మంగళగిరి పర్యటనలో షర్మిలకు షాక్‌, వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2VglYQA

No comments:

Post a Comment