etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, March 31, 2019

శ్రీవారి హుండీలో రూపాయి కూడా వేయొద్దు, ఎందుకంటే, కారణం ఇదే.

ఎన్నో ఏళ్లుగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కైంకర్యాల్లో పాల్గొన్న మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఇటీవల హుండీపై చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘హుండీలో స్వామికి ఒక్కరూపాయి కూడా వేయకండి. రోజుకు రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకూ హుండీ ఆదాయం వస్తోంది, కానీ ఒక్కరూపాయి కూడా స్వామి సేవకు అందులోనుంచి వినియోగించట్లేదు. పుష్పాలు, వస్త్రాలు, అలంకరణలు, ఉత్సవాలన్నిటినీ దాతల సహకారంతోనే చేస్తారు. పచ్చకర్పూరం, కస్తూరి కూడా స్వామికి డోనర్లే ఇస్తున్నారు.

హుండీ డబ్బులు ఉద్యోగులకు, ఇంజినీరింగ్‌ పనులకు, ఇతర కాంట్రాక్టర్లకు, ధర్మప్రచారానికే పోతున్నాయ్‌. కాబట్టి భక్తులెవ్వరు హుండీలో ఒక్కరూపాయి కూడా వెయ్యకండి. స్వామికి సేవచేయటం లేదా ధూపదీపాల్లేని ఆలయ అర్చకుల జీతాలకు, నైవేద్యాలకు విరాళాలు ఇవ్వండి. ఎక్కడ విరాళాలు ఇచ్చినా స్వామికి చేరుతాయి. మీకు పుణ్యం వస్తుంది. అలా కాకుండా పాపకార్యాలకు హుండీలో వేసిన డబ్బులను వినియోగించటం మీకూ మంచిది కాదు’ అని ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆయన వ్యాఖ్యలపై భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

The post శ్రీవారి హుండీలో రూపాయి కూడా వేయొద్దు, ఎందుకంటే, కారణం ఇదే. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2HRCwLK

No comments:

Post a Comment