etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, March 30, 2019

గొడుగుతో పాటు గాల్లోకి ఎగిరిపోయాడు..ఎలానో తెలుసా ..? వైరల్ వీడియో

బలంగా వీచిన ఈదురుగాలులకు వస్తువులు ఎగిరిపోవడం చూస్తుంటాం.. కానీ విచిత్రంగా గాలుల దాటికి ఓ వ్యక్తి గొడుగుతో పాటు గాల్లోకి ఎగిరిపోయాడు.. వివరాల్లోకి వెళితే.. టర్కీలోని ఒస్మానియా ప్రావిన్స్‌ కు చెందిన కొందరు వ్యక్తులు స్థానికంగా ఉన్న ఓ హోటల్ కు వచ్చారు. ఈ క్రమంలో ఆ ప్రదేశంలో ధాటిగా ఈదురు గాలులు వీచాయి. దీంతో గాలులను తట్టుకుని నిలబడేందుకు స్టాండ్‌ ఉన్న గొడుగు సాయం తీసుకున్నారు. అయితే తీవ్ర మైన గాలుల దాటికి గొడుగు తోపాటు ఓ వ్యక్తి కూడా పైకి ఎగిరిపోయాడు. నాలుగు మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత భయంతో కిందకి దూకేశాడు. అదృష్టవశాత్తు అతనికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వ్యక్తి సాదిక్‌ కొకడాలిగా గుర్తించారు.

The post గొడుగుతో పాటు గాల్లోకి ఎగిరిపోయాడు..ఎలానో తెలుసా ..? వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2UlG6np

No comments:

Post a Comment