రాత్రిపూట స్మార్ట్ ఫోన్ వినియోగించే వారికి షాకింగ్ న్యూస్ ఇది.. నైట్ ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ వినియోగించే వారు జాగ్రత్త వహించకుంటే కొద్దికాలం తర్వాత కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా కేసులు రెండు లండన్ లో నమోదయ్యాయని వార్తలు సైతం వచ్చాయి. ఈ రెండు కేసుల్లో బాధితులు ఒక కన్ను సరిగా కనిపించడంలేదని తమను సంప్రదించారని వైద్యులు తెలిపారు. చూపును పరీక్షించడంతో పాటుగా వారి అలవాట్లనూ వైద్యులు పరీక్షించారు. చివరకు వారు రాత్రివేళ స్మార్ట్ ఫోన్ వాడడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైందని నిర్థారించారు. బెడ్ మీద ఓవైపు తిరిగి పడుకుని స్మార్ట్ ఫోన్ చూస్తున్నప్పుడు ఒక కన్ను స్మార్ట్ ఫోన్ తెరపై ఉండగా మరో కన్నుకు తలకింద దిండు అడ్డుగా ఉండడం వల్ల ప్రమాదం నుంచి బతికిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. అందుకే ఇంకొకటి సాధారణంగా పనిచేస్తే మరొకటి స్మార్ట్ ఫోన్ తెరకు అలవాటు పడిందన్నారు. ఫలితంగా కొంతకాలానికి ఆ కంటిచూపు దెబ్బతిన్నదని వారు వివరించారు. మొత్తానికి పడుకునే ముందు స్నేహితులతో చాటింగ్ చేయడమో, వీడియోలు అదే పనిగా తెగ చూసేయడమో చేస్తే తాత్కాలిక అంధత్వం ముప్పు పొంచి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
The post రాత్రి పూట స్మార్ట్ ఫోన్ వాడితే కంటిచూపు పోతుందట!! దానికి కారణం ఇదే. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2W6v1nu
No comments:
Post a Comment