మధ్యాహ్నం భోజనం చేశాక.. సాయంత్రం సమయంలో చాలా మందికి లైట్‌గా ఆకలి వేస్తుంటుంది. దీంతో చాలా మంది బయట దొరికే జంక్ ఫుడ్‌ను తినేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే అవి కాకుండా సాయంత్రం సమయంలో పొద్దు తిరుగుడు విత్తనాలను స్నాక్స్ రూపంలో తీసుకుంటే.. దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది.
2. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
3. పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ తింటే జీర్ణసమస్యలు పోతాయి. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది.
4. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే ఎన్నో ఔషధ గుణాలు పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఉంటాయి. అలాగే ఎముకలు దృఢంగా కూడా మారుతాయి.
5. పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల మానసిక సమస్యలు పోతాయి. శరీరంలో ఉండే వాపులు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
6. హైబీపీ కంట్రోల్ అవుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం, వెంట్రుకలకు సంరక్షణ కలుగుతుంది.
The post పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ తింటే..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2JiE3fq
No comments:
Post a Comment