etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, March 15, 2019

జన్మ రాశుల ప్రకారం ఈ లక్షణాలున్న భర్తలే మిస్టర్ పర్ ఫెక్ట్!

చేసుకోబోయేవాడి పట్ల ఎన్నో ఆశలు, ఆకాంక్షలుంటాయి. తనను మనువాడబోయే వాడు అన్ని విధాలా సంతోష పెట్టాలని, మహారాణిలా చూసుకోవాలని ప్రతి ఆడపిల్లా కలలు కంటుంది. తమ కూతురికి కాబోయే వ్యక్తితో అన్యోన్య దాంపత్యం ఉండాలనే తల్లిదండ్రులు జన్మ రాశులను కూడా ఒకటికి నాలుగు సార్లు తరచి చూస్తారు. అయితే ఏయే ఆంకాంక్షలకు తగిన వరుడు కావాలంటే ఏ రాశి వారిని ఎంచుకోవాలో కింద తెలుసుకోండి..

మేష రాశిలో పుట్టిన వ్యక్తులు నమ్మకమై భర్తగానూ, మానసికంగా దృడంగానూ ఉంటారు. భార్య సంతోషం కోసం నిరంతరం పరితపిస్తుంటారు.
సింహ రాశి వారు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. అందుకే వీరిని ఎవరూ సులువుగా మోసగించలేరు. భార్యలను చూసుకునే విషయంలో మాత్రం తేడా రానీయరు.
కర్కాటక రాశి వారైతే అర్థాంగి ఆలోచనలే వేదంగా భావిస్తారు. భార్య కోరికలను గుర్తించి అవి నెరవేర్చడానికి కృషి చేస్తారు.
మిథున రాశి పురుషులు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. క్లిష్టమైన సమయాల్లో అండగా ఉంటారు. సమాజంలో వీరికి ఉన్న పేరు ప్రతిష్టల కారణంగా కామన్ గా అసూయ కూడా ఉంటుంది.
మీన రాశి వాళ్లు ఎల్లప్పుడూ భార్యలకు అందుబాటులో ఉంటారు. భార్యలు చెప్పే విషయాన్ని విని ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా పనులు నెరవేర్చుతారు.
వృష‌భ‌ రాశి వారు సహచరికి సహాయకారిగా ఉంటారు. సకల విషయాల్లోనూ తోడూ నీడగా వ్యవహరిస్తారు.
ధనస్సు రాశి వాళ్లు మేధావి వర్గానికి చెందిన వారు. ఎల్లప్పుడూ తెలివితేటలకు సంబంధించిన సంభాషణలను మాత్రమే చేస్తారు. అనవసరమైన విషయాలపై పట్టింపు ఉండదు.
కన్య రాశి వాళ్లు బంధాలపై ఎక్కువ ఆధారపడి ఉంటారు. కొన్నిసార్లు వీరి ప్రవర్తన వల్ల విసుగు పుడుతుంది. కాకపోతే పెళ్లి విషయంలో చాలా నిబద్ధతో ఉంటారు.
తుల రాశి వ్యక్తులు బ్యాలెన్స్ గా పోతారు. అనవసరమై విషయాలపై జీవిత భాగస్వామితో చర్చించరు. వర్తమానంలో జీవిస్తారు.
వృశ్చిక రాశిలో జన్మించినవాళ్లు రహస్యాలను దాచిపెడతారు. కాబట్టి వీరిని అర్థం చేసుకోలేరు. ఒక్కసారి నిజం చెప్పారంటే భాగస్వామికి జీవితాంతం విధేయుడిగా ఉంటారు.
మకర రాశిలో జన్మించిన వ్యక్తులు ప్రేమను మనసులోనే దాచుకుంటారు. వీరితో బంధం బలపడటానికి కొంత సమయం పడుతుంది కానీ మొదలైతే మాత్రం జీవితాంతం కొనసాగుతుంది.
కుంభ రాశి వాళ్లు సామాజిక సంబంధాలు కలిగి ఉంటారు. చాలామంది సహకారంతో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. తన చుట్టూ స్నేహితులు ఉండాలని కోరుకుంటారు.

The post జన్మ రాశుల ప్రకారం ఈ లక్షణాలున్న భర్తలే మిస్టర్ పర్ ఫెక్ట్! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2ObAG9a

No comments:

Post a Comment