ఎండాకాలం వాహనదారులు అనేక సమస్యలు ఎదుర్కోవాలి. సాధారణంగా ఎండ వేడిమి వల్ల వాహనాల రంగులు పోతుంటాయి. ఇంజన్ నుంచి పొగలు రావడం, పెట్రోల్ ఆవిరి కావడం, టైర్లు పంక్షరు కావడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టెందుకు కొన్ని జాగ్రత్తలు తప్పవు. వాహనాలను ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు పార్కింగ్ స్థలం చాలా అవసరం. ఎండలేని స్థలాల్లో పార్కింగ్ చేయడం బండికి ఎంతో శ్రేయస్కరం. ఇరుకైన రోడ్లు, దుకాణాల ముందే పార్కింగ్ చేయడంతో సమస్యలు తప్పడం లేదు. ఎండ అధికంగా ఉండే సమయంలో వాహనాల్లో ఉన్న పెట్రోల్ ఆవిరైపోతూ ఉంటుంది. వీలైనంత వరకు వాహనాలను నీడలోనే ఉంచాలి. రాత్రి వేళల్లో పెట్రోల్ ట్యాంక్ మూత ఒక సారి తీసి పెడితే మంచిది. దీంతో వేడి కారణంగా ట్యాంకర్‌లో ఏర్పడిన గ్యాస్ బయటకుపోయి ఇంజన్‌లోకి ఆయిల్ సులువుగా వెలుతుంది.
వేడిని తట్టుకునే సీటు కవర్లు
ద్విచక్ర వాహ నాలకు ముఖ్యంగా సీటు కవర్ల నాణ్యత అవసరం. ఎండ తీవ్రత నుంచి కాపాడి వేడిని తట్టుకునే సీటు కవర్లనే వాడాలి. లెదర్ సీటు కవర్లు వల్ల అధిక వేడి ఉంటుంది. వెల్‌వెట్, పోస్టుక్లాత్ వంటివి వాడడం మంచిది. ఇటీవల కాలంలో సీట్లకే కాకుండా పెట్రోల్ ట్యాంక్ కవర్లు పోస్టుక్లాత్ కవర్లు అందుబాటులోకి వచ్చాయి.
అదే పనిగా నడపవద్దు
వేసవిలో ద్విచక్ర వాహనాల వాడకం తగ్గించుకోవడం చాలా ఉత్తమం. ఇలా చేయడం ద్వారా అటు వాహనాలకు, వాహన చోదకులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రధానంగా దూర ప్రయాణాలు చేసే వారు బస్సులో వెళితేనే మంచిది. తప్పని సరై ద్విచక్ర వాహనంపై వెళితే మార్గమధ్యలో చల్లగా ఉన్న ప్రదేశంలో ఆపి కాసేపు విశ్రాంతి తీసుకుంటే మేలు. ఇలా చేయడం వల్ల ఇంజన్ సామర్థ్యం పెరగడంతో పాటు ఇంజన్ కండీషన్ మెరుగవుతుంది.
ఇంజన్ ఆయిల్ తరచూ మార్చుకోవాలి
ఇంజన్ ఆయిల్ మార్పిడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలంలో వేడి కారణంగా ఇంజన్ ఆయిల్ కూడా ఆవిరైపోయే అవకాశం ఉంది. వాహనం నడుపుతున్నప్పుడు వచ్చే వేడి, ఎండవేడి రెండూ కలసి ఇంజన్ ఓవర్ హీట్‌కు కారణమవుతుంది. దీంతో ఇంజన్ నుంచి పొగలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఎయిర్ లాక్ అవుతుంది. ఇంజన్ ఆయిల్ ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఇబ్బందులు ఉండవు. సాధారణంగా 2వేల కిలోమీటర్లకు మార్చే ఇంజన్ ఆయిల్‌ను వేసవిలో వెయ్యి నుంచి 1500 కిలో మీటర్లకు మార్చుకోవడం ఉత్తమం.
The post నడి ఎండలో బైక్‌ను పార్కింగ్ చేస్తున్నారా..? ప్రమాదం నుంచి ముందే మేల్కోండి..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2TKRr03
No comments:
Post a Comment