చనిపోయినవారికి ప్రాణం పోస్తున్న నెటిజన్లు. డాక్టర్లే చేయలేని పని వీరెలా చేస్తారనుకుంటున్నారా.. అదే కదా ట్విస్ట్. అవునండీ.. మీరు నమ్మకపోయినా.. నిజంగా నిజం అంటున్నారు నెటిజన్లు. చనిపోయినవారిని బ్రతికించటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొన్న ‘కికీ’ ఛాలెంజ్.. నిన్న ‘బర్డ్ బాక్స్’ వంటి డేంజర్ ఛాలెంజ్‌లు నెటిజన్ల ప్రాణాల మీదకు తెచ్చాయి. ఇప్పుడు ఏకంగా ‘రెజుర్రెక్షన్’ అనే ఛాలెంజ్ శవాలకి ప్రాణం పోస్తోంది. ‘రెజుర్రెక్షన్’ అనే ఛాలెంజ్ దక్షిణాఫ్రికాలోని ఓ మత బోధకుడి నుంచి మొదలైంది. ఆల్ఫ్‌లుకావు అనే మతబోధకుడు ప్రార్థన చేసి శవాన్ని పట్టుకోగానే అందులో ఉన్న వ్యక్తి పైకి లేచాడు. అంతే చనిపోయిన అతను బ్రతికాడని చుట్టుపక్కల వాళ్లు సంతోషంతో సంబరపడిపోయారు. దీంతో శవానికి ప్రాణం పోసే ఈ ఫీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇక నెటిజన్లు ఆ వీడియోను అనుకరిస్తూ ఫన్నీ వీడియోలు రూపొందిస్తున్నారు. #ResurrectionChallenge హ్యాష్‌ట్యాగ్‌తో వాటిని పోస్ట్ చేస్తు.. సవాల్ విసురుతున్నారు. దీంతో ఆఫ్రికా దేశాల్లో మొదలైన ఈ ఛాలెంజ్ క్రమంగా అన్ని దేశాలకూ విస్తరిస్తోంది.
Crooked Bushiri has nothing on Crooked Lukau. Alph lukau resurrect a man who is already breathing in the coffin – competition for these thugs so called pastors is very high and they are trying so hard. pic.twitter.com/CEfBtF0eEX
— Man’s Not Barry Roux (@AdvBarryRoux) February 25, 2019
The Internet will forever be undefeated
#ResurrectionChallenge pic.twitter.com/iOMIrWjX3i
— Tkay
(@tkaydrift) March 1, 2019
The post నెట్టింట్లో నయా ఛాలెంజ్.. మరణించిన వారిని మళ్ళి బతికిస్తున్న మతబోధకుడు, వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Cpjjg7


(@tkaydrift)
No comments:
Post a Comment