అందమైన అమ్మాయిని చూస్తే అచ్చం బొమ్మలా ఎంత అందంగా ఉందో అని అనుకోవడం పరిపాటి. మరి షోకేస్‌లో బొమ్మలా నిలబెట్టింది నిజంగా బొమ్మ కాదు అమ్మాయి అని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది. మెక్సికోలోని చిహ్వావా ప్రాంతంలో పస్కులా ఎస్పార్జా అనే వ్యాపారి తన దుకాణంలో ఈ బొమ్మను ఉంచాడు. చూపులు తిప్పుకోనివ్వని ఆ బొమ్మని చూసి ఇది బొమ్మ కాదేమో అన్న అనుమానం వ్యక్తం చేసేవారు కస్టమర్లు. దాన్ని అదే పనిగా చూస్తే ఒకింత భయ కూడా కలిగేది వారికి. బొమ్మ కళ్లు తమనే చూస్తున్నట్లు వుండేవని ఒకసారి చూస్తే.. రాత్రంతా ఆ కళ్లు తమని వెంటాడుతుండేవని అంటారు. బొమ్మ వెనుక అనుమానాల్ని వ్యక్తం చేసి ఓ కథ ప్రచారంలో ఉంది.
షాపు యజమాని తన కూతురుని చాలా అపురూపంగా చూసుకునేవాడు. కానీ ఆమెను ఓ సాలీడు కుట్టడం కారణంగా అర్థాంతరంగా తనువు చాలించింది. కూతురి మీద ప్రేమతో ఆమె మరణాన్ని తట్టుకోలేని తండ్రి బిడ్డ శవానికి రసాయనాలు పూసి షాపు షోకేస్‌లో పెట్టి ఉంటాడని కస్టమర్లు భావిస్తున్నారు. దుకాణంలో పని చేసే అమ్మాయి సోనియా బురుసిగ మాటలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నట్లుండేవి.“ఈ బొమ్మకు రోజూ దుస్తులు నేనే మార్చేదాన్ని. బొమ్మ వద్దకు ఎప్పుడు వెళ్లినా నాకు వళ్లంతా చెమటలు పట్టేవి. బొమ్మ చేతులు నిజమైన చేతుల్లా ఉండేవి. కాళ్లపై నరాలు కూడా ఉబ్బి వుండేవి. అది బొమ్మకాదు. నిజంగా మనిషే అని నాకు గట్టి నమ్మకం అని అంటోంది”.
అయితే షాపు యజమాని మాత్రం మీరందరూ అనుకున్నట్లు అతి తన కుమర్తె శవం కాదని అంటున్నాడు. మరి ఆయన కుమార్తె పస్కులా మరణించిన కొన్ని రోజులకే దుకాణంలో ఆ బొమ్మ ప్రత్యక్షమైంది. దానికి ముద్దుగా షాపు యజమాని పస్క్యూలిటా అని పేరు కూడా పెట్టాడు.ఇది 1930లో జరిగింది కావడంతో ఆ రోజుల్లో వ్యాక్స్ తయారు చేసిన బొమ్మలు ఉండడానిక్కూడా ఆస్కారం లేదని భావిస్తున్నారు. ఈ బొమ్మ ఇప్పటికీ ఆ షాపులోనే ఉంది. మరి దీని వెనకున్న మిస్టరీ ఏంటనేది దుకాణ యజమానికి, అందులో పని చేసే వ్యక్తులకు మాత్రమే తెలియాలి. మెక్సిలో మాత్రం లా పస్క్యులిటా పేరు చెబితే చాలు అందరూ ఈ బొమ్మ గురించే మాట్లాడుకుంటారు.
The post అద్దాల గదిలో అందమైన బొమ్మ.. కాదు అమ్మాయి శవం, అలానే ఉండటానికి కారణం ఇదే. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2TL7qeD


No comments:
Post a Comment