విశ్వాసానికి మారుపేరు అంటే కుక్కలే గుర్తొస్తాయి అందరికీ. పాలు పోసి.. ప్రేమగా పెంచితే.. ప్రాణం పోతున్నా.. యజమాని రక్షణలోనే ఉంటాయవి. దీనికి సజీవ సాక్ష్యం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి బాందా సిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫర్నీచర్ షో రూంలో చెలరేగిన మంటలు పై అంతస్థులకు వ్యాపించాయి. పైనున్న మూడు, నాలుగు అంతస్థులలో కొంతమంది నివసిస్తున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అయితే కిందనున్న మంటలు వేగంగా పైకి వెళుతున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన వారి పెంపుడు కుక్క.. పెద్దగా అవరడం ప్రారంభించింది. అందరినీ అలర్ట్ చేసింది. దాని అరుపులతో ఒక్కసారిగా మేల్కొన్న వాళ్లు.. అక్కడి నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడగలిగారు. 30 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే అంతమందిని ప్రాణాలతో బయటపడేసిన ఆ శునక రాజం.. తను మాత్రం ప్రాణాలు కోల్పోయింది. కింద ఫ్లోర్‌లో కట్టేసి ఉండటంతో మంటలకు ఆహుతైపోయింది. ప్రాణాలతో బయటపడ్డ వాళ్లు తమకు పునర్జన్మ నిచ్చిన ఆ మూగజీవి పట్ల కృతజ్ఞతాభావంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అక్రమంగా ఫర్నీచర్ షోరూమ్ నిర్వహిస్తున్న యజమానిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
The post రియల్లీ గ్రేట్, తాను కాలి బూడిదవుతున్నా.. 30 మందిని కాపాడిన శునకం! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Z5HN89
No comments:
Post a Comment