రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రతిపక్షాల ఆరోపణలకు మరింత ఊతమిచ్చే వార్తను ఫ్రెంచ్ పత్రిక ‘లే మాండే’ ప్రచురించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని ప్రకటించిన అనంతరం అనిల్ అంబానీ నేతృత్వంలోని ఓ కంపెనీకి సుమారు 162.6 మిలియన్ డాలర్ల మేలు జరిగినట్లు తెలిపింది. దీనిపై అనిల్ నేతృత్వంలోని కంపెనీ స్పందిస్తూ ఫ్రాన్స్ చట్టాల పరిధిలోనే వివాదాన్ని పరిష్కరించుకున్నామని తెలిపింది.
అనిల్ అంబానీ నేతృత్వంలో ఫ్రాన్స్‌లో రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ అనే టెలికాం కంపెనీ ఉంది. ఈ కంపెనీ పన్ను వివాదంలో ఇరుక్కుంది. భారత్-ఫ్రాన్స్ మధ్య రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత ఈ కంపెనీ పన్ను బాకీ 162.6 మిలియన్ డాలర్లను ఫ్రెంచ్ అధికారులు రద్దు చేశారని చెప్తూ ఓ కథనాన్ని ‘లే మాండే’ ప్రచురించింది.
ఈ కథనంపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్పందించింది. ఫ్రెంచ్ అధికారుల పన్ను డిమాండ్ సమర్థనీయం కాదని, చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఇది 2008నాటి కేసు అని తెలిపింది. దీనిపై ఓ పరిష్కారాన్ని ఫ్రెంచ్ అధికారులతో ఆ దేశ చట్టాలకు అనుగుణంగా కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ పరిష్కారం వల్ల ఎటువంటి లబ్ధి జరగలేదని, పక్షపాతంతో వ్యవహరించలేదని వివరించింది. 2008-2012 మధ్య కాలంలో రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్‌కు ఆపరేటింగ్ నష్టాలు 2.7 మిలియన్ యూరోలు అని, అయినప్పటికీ ఫ్రెంచ్ పన్ను అధికారులు అత్యధిక పన్ను విధించారని, దీనిపై పరస్పర పరిష్కార ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది.
The post అనిల్ అంబానీకి 162 మిలియన్ డాలర్ల మేలు : ఫ్రెంచ్ పత్రిక appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Ug3HBP


No comments:
Post a Comment