హిందూ దేవాలయాలను పునరుద్ధరించాలంటూ అనేక సంవత్సరాలుగా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. సుమారు 400 హిందూ దేవాలయాల పునరుద్ధరణకు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలయాల పునరుద్ధరణ తర్వాత వాటిని హిందువులకు అప్పగించనున్నారు. విభజన సమయంలో భారీ సంఖ్యలో హిందువులు పాకిస్థాన్ విడిచి.. భారత్‌కు తరలి వచ్చేశారు. అలా వచ్చేసిన తర్వాత అక్కడున్న వారి భూములు, ఆస్తులు స్థానికుల పరమయ్యాయి. ఆలయాలు మదర్సాలుగా మారిపోయాయి. అయితే ఇప్పటికి వాటికి మోక్షం కలగనుంది. ఇమ్రాన్ ప్రభుత్వం వాటిని పునరుద్ధరించే పనిలో పడింది. శాంతి, సామరస్యతలు పెంపొందించే దిశగా పునరుద్ధరణ చర్యలు చేపట్టామని పాక్ ప్రభుత్వం తెలిపింది.
ఆల్ పాకిస్థాన్ హిందూ రైట్స్ మూవ్‌మెంట్స్ లెక్కల ప్రకారం పాకిస్థాన్‌లో 428 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 408 ఆలయాలు రెస్టారెంట్లుగా, స్కూళ్లుగా, ప్రభుత్వ ఆఫీసులుగా, బొమ్మల షాపులుగా మారిపోయాయి. 2019లోగా సింధ్‌లో 11, పంజాబ్‌లో 4, బెలూచిస్థాన్‌లో మూడు, ఖైబర్ ఫంక్తున్ఖ్వాలో రెండు ఆలయాలను పునరుద్ధరించాలన్న నిర్ణయానికి పాక్ సర్కార్ వచ్చింది. ఇదిలా ఉంటే పీవోకేలో ఉన్న సుప్రసిద్ధ శారదా పీఠం దర్శన భాగ్యం పాక్‌లోని హిందువులకు కలగనుంది.
The post 400 హిందూ ఆలయాలను పునరుద్ధరించనున్న పాక్. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2KAzKwC
No comments:
Post a Comment