కొందరు హీరోలు సెల్ఫీల కోసం వచ్చే అభిమానుల మీద దాడులకు తెగబడుతుంటే మరి కొంతమంది హీరోలు మాత్రం పెద్ద మనుసుతో వ్యహరిస్తున్నారు. అభిమానులను ఆప్యాయంగా దగ్గర తీసుకొని వారితో కలిసి ఫొటోలు దిగుతున్నారు. తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ సందర్భంగా ఇలాంటి ఘటనే జరిగింది. తన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకొని బయలుదేరిన బన్నీకి రోడ్డు మీద ఇద్దరు దివ్యాంగులు తనకు అభివాదం చేస్తూ కనిపించారు. వెంటనే స్పందించిన బన్నీ.. కారు ఆపి వారిని పలకరించాడు, వారి కోరిక మేరకు వారితో కలిసి ఫొటో దిగాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టైలిష్ స్టార్ అభిమానులు ఈ ఫొటోను షేర్ చేస్తూ పొంగిపోతున్నారు.
The post బన్నీ పెద్ద మనసు.. కారు ఆపి మరీ..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2UxOVeK

No comments:
Post a Comment