గర్భిణీ స్త్రీలు మేకప్ వేసుకుంటే ప్రమాదమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. ఆహారం, మందుల విషయంలో కచ్చితంగా వైద్యుల సలహా పాటించాలని.. ముఖ్యంగా ముఖానికి కాస్మొటిక్స్ వాడకూడదని సూచిస్తున్నారు. లిప్‌స్టిక్, మాయిశ్చరైజర్లు, ఇతర సౌందర్య సాధనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని.. ఆహరం విషయంలో కూడా ఏ మాత్రం తేడా వచ్చినా కడుపులో ఉండే బిడ్డకే కాదు, తల్లికి కూడా ప్రాణాంతక పరిస్థితులు వస్తాయని అంటున్నారు.
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు గర్భంతో ఉండి మేకప్ వేసుకునే స్త్రీలను పరీక్షించారు. ఈ పరిశోధనలో గర్భం దాల్చిన స్త్రీలు మేకప్ వేసుకోవడం వల్ల వారి కడుపులో ఉండే బిడ్డపై ఆ మేకప్ సామగ్రిలో ఉండే కెమికల్స్ ప్రభావం పడుతుందని తేలింది. దీని వల్ల పుట్టబోయే బిడ్డలలో మానసిక ఆరోగ్యం, చురుకుదనం లేకపోవడం వంటి సమస్యలు వస్తాయని తేల్చారు. దీంతో వీలైనంతగా వీటికి దూరంగా ఉండాలని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు.
The post గర్భిణీ స్త్రీలు మేకప్ వేసుకుంటే ప్రమాదమట.. ఎలా అంటే..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2GdjoEY
No comments:
Post a Comment