వీకెండ్.. సరదా 18 ఏళ్ల కుర్రాడి ప్రాణాలను తీసింది. ముగ్గురు స్నేహితులు కలిసి హోండా సిటీ కారులో సరదాగా సిటీ ట్రిప్ వేశారు. రద్దీగా ఉన్న రోడ్డుపై కారును గంటకు 100 కిలోమీటర్ల అతివేగంతో నడిపారు. రోడ్డుపై డివైడర్ ను తప్పించే ప్రయత్నంలో కారు వేగాన్ని కంట్రోల్ చేయలేక కాంక్రీట్ పోల్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలోని జ్వాలా హేరీ మార్కెట్ దగ్గర (ఏప్రిల్ 20, 2019) రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి. కారును అదుపు చేయలేక పక్కనే ఉన్న కరెంట్ పోల్ ను ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. రెండు ముక్కలైంది. ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడి సీసీ కెమెరాలో వీడియో రికార్డు అయింది.
వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారులో ప్రయాణించిన ముగ్గురి యువకులు హిమాన్షు, జయంత్, సాహెబ్ పోలీసులు గుర్తించారు. ముగ్గురిలో సాహేబ్ కారు నడుపుతున్నాడు. ముందు సీటులో హిమాన్షు కూర్చొగా, జయంత్ కారు వెనుక సీటులో కూర్చొన్నట్టు పోలీసులు తెలిపారు.
హిమాన్షు ప్రాణాలు కోల్పోగా, గాయపడ్డ సాహేబ్, జయంత్ ను సమీప ఆస్పత్రికి తరలించారు. సాహేబ్ కు ఇటీవలే అతని తల్లిదండ్రులు కొత్త కారు కొనిచ్చినట్టు పోలీసులు విచారణలో తెలిపారు. కారులో ప్రయాణించిన ముగ్గురిలో ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని, ప్రమాద సమయంలో ముగ్గురు మద్యం సేవించి ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Watch: Delhi teen loses control of car in fatal crash pic.twitter.com/NHreH0RNr1
— TOI Delhi (@TOIDelhi) April 22, 2019
The post వామ్మో …..! ఢిల్లీ లో ఓ కారు కరెంట్ స్తంభాన్ని గుద్దితే అది ఏకంగా రెండు ముక్కలైంది. వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Xv9IN5


No comments:
Post a Comment