etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, April 8, 2019

అభిమానిని వెంటపడి కొట్టిన నందమూరి బాలకృష్ణ, వీడియో వైరల్

తెలుగు సినిమా హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తన దురుసు ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో ఓ అభిమానిని బాలకృష్ణ కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలకృష్ణ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బాలకృష్ణను తన కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించిన కార్యకర్తపై బాలకృష్ణ చేయి చేసుకున్నారు.

ఎన్నికల ప్రచార రథంలో వెళ్తున్న బాలకృష్ణ వీడియోను తీస్తూ దగ్గరికి వచ్చారు. తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుండగా బాలకృష్ణ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. అనంతరం యువకుడు వెనక్కి పరుగు పెట్టాడు. అయినా బాలయ్య అతడి వెంట పరిగెత్తుకుని వచ్చి దాడి చేశాడు. సుమారు 49 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో బాలకృష్ణ చేసిన పనిని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే, అసలు అభిమానిని బాలకృష్ణ ఎందుకు కొట్టాడనే వివరాలు తెలియరాలేదు.

The post అభిమానిని వెంటపడి కొట్టిన నందమూరి బాలకృష్ణ, వీడియో వైరల్ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2VqirPX

No comments:

Post a Comment