తులసి ఆకులు మాత్రమే కాదు, తులసి విత్తనాల్లోనూ ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉంటాయి. తులసి విత్తనాలను తింటే మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. అలాగే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి తులసి విత్తనాలను రోజూ తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. తులసి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. శరీరంలో కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను ఈ యాంటీ ఆక్సిడెంట్లు అడ్డుకుంటాయి.
2. వయస్సు మీద పడడం కారణంగా చర్మంపై వచ్చే ముడతలు తగ్గాలంటే నిత్యం తులసి విత్తనాలను తింటుండాలి.
3. తులసి విత్తనాల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది. వెంట్రుకలు రాలకుండా చేస్తుంది.
4. తులసి విత్తనాల్లో ఉండే ఫైబర్ జీర్ణసమస్యలను పోగొడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది.
5. రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయే వారు తులసి విత్తనాలను తింటే ఫలితం ఉంటుంది.
6. తులసి విత్తనాలను నిత్యం తింటుంటే హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది.
7. తులసి విత్తనాల్లో ఉండే విటమిన్ కంటి సమస్యలను పోగొడుతుంది. చూపును మెరుగు పరుస్తుంది.
8. తులసి విత్తనాల్లో ఉండే పొటాషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
The post తులసి విత్తనాలు తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో చుడండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2YH3WJL
No comments:
Post a Comment