విద్యార్థుల ఉద్రేకం..తల్లిదండ్రుల శాపనార్థాలు.. విద్యార్ధి సంఘాల ముట్టడితో నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు అట్టుడికిపోయింది. అదికారుల చేసిన తప్పిదాలు విద్యార్థుల పట్ల శాపంగా మారాయి. తాజాగా దీనికి సంబంధించి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండకు చెందిన ఎండీ.నౌషిన్ హైదరాబాద్‌లోని హయత్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2018లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అయితే ఆమె ఈ ఏడాది మార్చిలో మెడిసిన్ సీటు కోసం అరబిక్ పేపర్ – 1, 2 పరీక్షలు (ఎక్స్‌టర్నల్ లాంగ్వేజ్) రాశారు. ఇంటర్ బోర్డు ఇలవలే విడుదల చేసిన ఫలితాల్లొ ఆమెకు ఉర్దూ పేపర్-1, 2 రాసినట్లు.. వాటిలోనూ సున్నా మార్కులు వచ్చినట్లు ఉంది. దీంతో నౌషిన్ నివ్వెరపోయారు. రాసింది ఆరబిక్ పేపరైతే ఉర్ధూ పేపర్ రాసినట్లుగా రావడం ఏంటని నౌషిన్ ప్రశ్నించారు. తనకు కనీసం 90 మార్కులు వస్తాయని భావించనాని కానీ వచ్చిన మార్కులు చూసి ఆశ్చర్యపోయానన్నారు. ప్రస్తుతం రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. తనకు జరిగిన అన్యాయం గురించి గత రెండు రోజులుగా కుటుంబసభ్యులతో కలిసి బోర్డు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని వాపోయారు.
The post ఇంత నిర్లక్ష్యమా.. అరబిక్ రాస్తే.. ఉర్దూ రాసినట్లు ఇచ్చారు.. అందులోనూ.. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2IDHIUc
No comments:
Post a Comment