కరణ్ జోహార్ నిర్మిస్తున్న కళంక్ సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజైంది. టీజర్‌తో సినీ ప్రేక్షకుల్ని థ్రిల్ చేసిన ఆ చిత్ర నిర్మాతలు ఇవాళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఓ ప్రేమకావ్యాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దినట్లు కళంక్ టీజర్‌తో తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండ్‌గా ఉంది. కళ్లుచెదిరేలా సన్నివేశాలు ఉన్నాయి. ఈ ఫిల్మ్‌లో బాలీవుడ్ హేమాహేమీలు నటిస్తున్నారు. సంజయ్ దత్, మాధురి దీక్షిత్, ఆలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షీ సిన్హా, ఆదిత్యరాయ్ కపూర్‌లు ఉన్నారు. చాన్నాళ్ల తర్వాత మాధురీ దీక్షిత్, సంజయ్ దత్‌లు కలిసి నటిస్తున్నారు. అభిషేక్ వర్మన్ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 17న కళంక్ రిలీజ్ అవుతోంది.
The post కళ్లు చెదిరే.. కళంక్ ట్రైలర్, ఎలా ఉందొ మీరు చుడండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Ututut
No comments:
Post a Comment