టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తాత కాబోతున్నారు. కాకపోతే ఇది రియల్ లైఫ్‌లో కాదులేండి. రీల్ లైఫ్‌లో. ప్రస్తుతం సీక్వెల్స్‌పైనే పూర్తి దృష్టి పెట్టిన నాగార్జున మన్మథుడు చిత్రానికి సీక్వెల్‌గా మన్మథుడు 2 చిత్రం చేస్తున్నాడు . ఇటీవల ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళగా కొద్ది రోజుల పాటు ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరగనుంది. ఆ తర్వాత యూరప్‌లో కీలక షెడ్యూల్ జరపనున్నారు. అలాగే మూడేళ్ల క్రితం నాగార్జున హీరోగా..కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా చేయనున్నాడు నాగ్. ఈ సినిమా ఆగస్ట్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందట. ఇందులో నాగ చైతన్యకి తాతగా నాగ్ కనిపించనున్నాడట. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తాయని అంటున్నారు. ఇప్పటికే చైతూ- నాగ్ కలిసి మనం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం సాధించింది. అయితే రీల్ లైఫ్‌లో నాగ్ తాత అవ్వడం వరకు ఓకే. మరి రియల్ లైఫ్‌లో ఆయన తాత ప్రమోషన్ ఎప్పుడు అందుకుంటారని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నాగ చైతన్య, సమంతల పెళ్లి జరిగి ఇప్పటికే ఏడాది దాటింది. ఈ నేపథ్యంలో అభిమానులు అక్కినేని వాళ్లింటి నుంచి శుభవార్త వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
The post అక్కినేని అభిమానులకి శుభవార్త, తాత కాబోతున్న నాగార్జున ..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2KiFmf9
No comments:
Post a Comment