etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, April 4, 2019

పీక కోస్తా.. కార్యకర్తలపై బాలకృష్ణ ఆగ్రహం, వీడియో వైరల్

నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా.. ఇవి సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యకర్తలతో ఆగ్రహంతో ఊగిపోతూ అన్న మాటలు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య తన స్వరూపాన్ని మరోసారిబయటపెట్టారు. ఈసారి సొంత కార్యకర్తలపైనే విరుచుకుపడ్డారు. హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భార్య వసుంధరతో కలిసి బాలకృష్ణ ఎన్నికల ప్రచార రథంపై వెళుతుండగా ఓ కార్యకర్త ఈ ఎన్నికల్లో మీకు వేలల్లో మెజారిటీ వస్తుందంటూ అరిచాడు. మరో కార్యకర్త కూడా బాలయ్య ఈసారి 60 వేల మెజారిటీ అంటూ అరిచాడు.

హిందూపురంలో గెలవడమే కష్టంగా ఉందని, వేలు లక్షల మెజారిటీ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైప్ క్రియేట్ చేసేవారి పీక కోయాలంటూ అనుకరిస్తూ మరీ పక్కనే ఉన్న వసుంధరతో అన్నారు. బాలకృష్ణ కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తుండగా వసుంధర నవ్వుతూ కనిపించారు. మరో కార్యకర్త సర్‌ 60 వేలు, 70 వేలు మెజారిటీ సర్‌ అంటూ అరవడంతో.. అరే, నీ పేరు అడ్రస్‌ చెప్పరా.. గెలవకపోతే నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. బాలకృష్ణ చేష్టలపై హిందూపురం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

The post పీక కోస్తా.. కార్యకర్తలపై బాలకృష్ణ ఆగ్రహం, వీడియో వైరల్ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2YKoCAB

No comments:

Post a Comment