etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, April 4, 2019

నా కోడిపిల్లను కాపాడండీ..అంటూ… పాకెట్ మనీతో ఆస్పత్రికి పరిగెత్తిన బుడతడు, వైరల్ న్యూస్

పసివాళ్ల చిలిపిచేష్టలు చూస్తే అందరికి ముచ్చటేస్తుంది. పిల్లలు అల్లరి చేసినా.. ముద్దుగానే అనిపిస్తుంది. కల్మషం లేని మనస్సు వారిది. చిన్న పిల్లలు.. వాళ్లకేం తెలుసులే అని కొట్టిపారేయద్దు… వయస్సుకు చిన్న పిల్లలైనా కొన్నిసార్లు పెద్దవాళ్లకంటే చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తారు. మిజోరానికి చెందిన ఆరేళ్ల పసివాడి అమాయకత్వాన్ని చూస్తే అది నిజమేని అంటారు. సైకిల్ తొక్కుతూ బయటకు వెళ్లిన సమయంలో కోడిపిల్ల తన సైకిల్ కిందపడింది. కళ్ల ఎదుటే ప్రాణాలు కోల్పోతున్న కోడిపిల్లను చూసి ఆ పసి హృదయం తల్లడిల్లింది. వెంటనే కోడి పిల్ల ప్రాణాలు కాపాడాలనుకున్నాడు. ముందుగా గాయపడిన కోడిపిల్లను తండ్రికి చూపించగా.. అది చనిపోయిందని చెప్పాడు.

కానీ, ఆ పసి మనస్సు ఊరుకోలేదు. ఆస్పత్రికి తీసుకెళ్దామంటూ తండ్రిని పదేపదే అడిగాడు. దాంతో తండ్రి నువ్వే తీసుకెళ్లు ఆస్పత్రికి అని తన పాకెట్ మనీ నుంచి పది రూపాయలు ఇచ్చి పంపాడు. ఒక చేత పది రూపాయల నోటు పట్టుకుని మరో చేతిలో గాయపడిన కోడిపిల్లను పట్టుకుని ఆస్పత్రికి పరుగులు తీశాడు. ఆస్పత్రిలో నర్సు దగ్గరకు వెళ్లి కోడిపిల్ల ప్రాణాలు కాపాడండి అంటూ చేతిలో పది రూపాయలు చూపించాడు. థీనంగా అడుగుతున్న అతన్ని చూసిన నర్సు మనస్సు కరిగిపోయింది. కోడిపిల్ల చనిపోయిందని ఎలా చెప్పాలో తెలియక.. కోడిపిల్ల బాగానే ఉందని.. కాసేపట్లో లేచి నడుస్తుందని చెప్పి పంపింది.

ఇంటికి వెళ్లిన బాలుడిని అతడి తల్లిదండ్రులు.. కోడిపిల్ల చనిపోయిందని, ఆస్పత్రివాళ్లు కూడా ఏంచేసేది ఉండదని చివరికి ఏదోలా నచ్చజెప్పారు. బాలుడు ఆస్పత్రికి వెళ్లిన సమయంలో అక్కడి వారు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ ఫొటో తెగ వైరల్ అవుతోంది. బాలుడి అమాయకత్వాన్ని చూసి నెటిజన్లు అయ్యో.. పాపం.. బుడ్డోడా ఎంత గొప్ప మనస్సు నీది.. అంటూ మెచ్చుకుంటున్నారు. వైరల్ అయిన ఈ ఫొటోకు లక్షల రీయాక్షన్స్, పదివేల కామెంట్లు వచ్చాయి.

The post నా కోడిపిల్లను కాపాడండీ..అంటూ… పాకెట్ మనీతో ఆస్పత్రికి పరిగెత్తిన బుడతడు, వైరల్ న్యూస్ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2uTkl01

No comments:

Post a Comment