రాష్ట్రాభివృద్ధి చేసిన టీడీపీని ఆదరించాలని హీరో మహేష్ బాబు సోదరి, ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ భార్య పద్మావతి అన్నారు. మండల పరిధిలోని గోగులమూడి, రావిపాడులో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, ప్రతిపక్షానికి ఓటు వేస్తే దుర్భిక్షం తప్పదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకులకు, వారికి తోడ్పాటునందిస్తున్న నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
భావితరాల భవిష్యత్ కోసం జరగనున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలన్నారు. రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో నదుల అనుసంధానం ద్వారా తాగు, సాగునీరు అందిస్తున్న ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు. అనంతరం ప్రచార రథంపై గ్రామంలో వీధివీధిన తిరుగుతున్న ప్రజలకు అభివాదం చేస్తూ 11న జరగనున్న ఎన్నికల్లో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గల్లా జయదేవ్, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లకు తమ అమూల్యమైన ఓటును వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
The post భర్త గెలుపు కోసం జనంలోకి హీరో సోదరి ! ఎవరో గుర్తుపట్టారా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2U3Z2Ts
No comments:
Post a Comment