etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, April 24, 2019

లక్ష కోట్లు జగన్ పై రాజకీయ ఆరోపణలే

మాజీ జెడి లక్ష్మీ నారాయణ బయటపెట్టిన మహా కుట్ర. శ్రీ వైఎస్ గారు లక్ష కోట్లు దోచారు అనేది అబద్ధం అతనిపై సిబిఐ చేసిన ఆరోపణలు కేవలం 1500 కోట్లు మాత్రమే , రాజకీయ నాయకులు కావాలని లక్ష కోట్లు అని ప్రచారం చేశారు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని లక్ష్మీనారాయణ స్పష్టీకరణ. తమకు వచ్చిన ఎవిడెన్స్‌ (ఆధారాలు) మేరకే చార్జిషీట్‌లో పొందుపర్చామని, దాని ప్రకారమైతే రూ.1,500 కోట్లు మాత్రమేనని, రూ.లక్ష కోట్లయితే కానే కాదని పేర్కొన్నారు. జగన్‌పై ఆరోపణలు చేసి, ఎవరో రాజకీయంగా వాడుకుని ఉంటే దానికి తామేమీ చేయలేమని తేల్చిచెప్పారు.

దీనితో జగన్ పై జరిగిన కుట్ర బట్టబయలు అయ్యింది. టీడీపీ వారు పదే పదే పది సార్లు లక్ష కోట్లు అని ఆరోపణ చేయటం, తెలిసిందే ఎప్పుడు జగన్ ని హేళన చేసిన వారు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి.రాజకీయ ఆరోపణలను తాను ఖండించలేనని తెలిపారు. జేడీ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ జగన్ కేసులను విచారించిన సంగతి తెలిసిందే.

The post లక్ష కోట్లు జగన్ పై రాజకీయ ఆరోపణలే appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2KWHKby
via IFTTT

No comments:

Post a Comment