ఓ చేతిలో కోడిపిల్ల.. మరోచేతిలో 10 రూపాయలు పట్టుకుని డాక్టర్ అంకుల్ ఈ డబ్బులు తీసుకొని ఈ కోడిపిల్లను బతికించండి అంటూ ఆసుపత్రికి వెళ్లిన ఓ చిన్నోడి కథ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. మిజోరాంలోని సైరంగ్‌కు చెందిన ఆ కుర్రాడు డెరెక్ లాల్‌చన్‌హిమా(6) .. ఓ కోడిపిల్ల తన సైకిల్ కింద పడటం చూసి చలించిపోయాడు. వెంటనే తన కిడ్డీబ్యాంకులో ఉన్న 10 రూపాయలు తీసుకుని ఆ కోడిపిల్లను ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఓ చేతిలో కోడిపిల్ల.. మరోచేతిలో 10 రూపాయలు పట్టుకుని దీనంగా చూస్తున్నడెరక్ అమాయకత్వం చూసిన అక్కడి నర్స్ ఆ ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఈ ఫొటో నెట్టింట హల్‌చల్ చేయడమే కాకుండా రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి కళ్లు తెరిపించింది. కళ్ల ముందే ప్రమాదాలు జరిగినా పట్టించుకోకుండా వెళ్లిపోయేవారికి బుద్ది చెప్పింది.
ఆ చిన్నోడి అమాయకంగా చేసిన పని ప్రతి ఒక్కరి మనసులను తాకేలా ఉండటంతో నెటిజన్లంతా ‘నీదెంత మంచి మనసురా చిన్నోడా!’ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో ఈ బుడ్డోడు రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. అందరి మనసులను కదలించిన ఆ బుడ్డొడిని అతని స్కూల్ ఘనంగా సత్కరించింది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన యోధులను సత్కరించే శాలువాతో బుడ్డోని సత్కరించి, శౌర్య అవార్డును అందజేసింది.
The post చిట్టి వయసు లో పెద్ద మనసు, కోడిపిల్లను బతికించమన్న చిన్నోడికి అవార్డు! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2FUEckd
No comments:
Post a Comment