etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, April 12, 2019

మహిళ కంట్లో తేనెటీగలు..కన్నీళ్లు తాగుతూ బతికాయి..చివరకు ఏం జరిగిందో చుడండి.

ఈ వార్త కల్పితంగా, వినడానికి ఆశ్చర్యం కలిగించేలా ఉండొచ్చు. కానీ ఇది వాస్తవిక సంఘటన. పొరపాటున కంటికి ఏదైనా తగిలితే విలవిల్లాడిపోతాం. అలాంది తైవాన్‌కు చెందిన ఓ మహిళ కంట్లో ఏకంగా తేనెటీగలు కాపురమే పెట్టేశాయి. ఆ మహిళ కంటికి వాపు రావడంతో ఫోయిన్ యూనివర్సిటీ ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది. దీంతో ఆమె కంటిని పరీక్షించిన వైద్యులకు అవాక్కయ్యే నిజం తెలిసింది. కంట్లో సజీవంగా నాలుగు తేనెటీగలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అవి ఆ మహిళ కన్నీటిని ఆహారంగా తీసుకుని నివసిస్తున్నట్లుగా వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆమెకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు కంటి సాకెట్ నుంచి వాటిని బయటకు తీశారు.

ఆ మహిళకు చికిత్స అందించిన డాక్టర్ హంగ్ చి-టింగ్ చెప్పింది పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘కంటిని పరీక్షించిన సమయంలో కీటకానికి సంబంధించి కాళ్ళను గుర్తించాము. సూక్ష్మదర్శిని సహయంతో వాటిని నెమ్మదిగా బయటకు తీశాము. కంటి భాగం చాలా సున్నితమైనది. అందుకే దానికి ఎలాంటి నష్టం కలగకుండా ఈ చికిత్సనిర్వహించినట్లు’ వివరించారు. ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే తొలిసారని డాక్టర్‌ తెలిపారు.

తైవాన్‌కు చెందిన ఎంఎస్ హీ బంధువు సమాధి వద్ద నివాళిలు ఆర్పించేందుకు వెళ్లింది. ఈ సమయంలో అక్కడ చెత్తలో ఉన్న దోమల్లాంటి చిన్న చిన్న కీటకాలు ఆమె కంటిలోకి వెళ్లాయ. కళ్లు దురదగా అనిపించడంతో వాటిని నీటితో శుభ్రం చేసుకుని అలాగే వదిలివేసింది. కొద్ది రోజుల తర్వాత కళ్లు వాపు రావడంతో ఫూయిన్ యూనివర్సిటీ హాస్పిటల్‌‌కు వెళ్లింది. ఆమెను పరిశీలించిన డాక్టర్ హుంగ్ చి-టింగ్.. ఆమె కళ్లలో నాలుగు తేనెటీగలు ఉన్నట్లు గుర్తించారు.

The post మహిళ కంట్లో తేనెటీగలు..కన్నీళ్లు తాగుతూ బతికాయి..చివరకు ఏం జరిగిందో చుడండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2UykLb2

No comments:

Post a Comment