etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, April 1, 2019

రూపాయి ఫ్లాష్ సేల్‌తో వచ్చేస్తున్న షియోమీ.. మూడు రోజులపాటు ఆఫర్లు

చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ మరోమారు ‘ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్’ పేరుతో ఆఫర్ల వాన కురిపించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్‌లో పోకో ఎఫ్1, రెడ్‌మీ నోట్ 6 ప్రొ తదితర స్మార్ట్‌ఫోన్లతోపాటు ఎంఐ లెడ్ టీవీ 4 ప్రొ, ఎంఐ బ్యాండ్, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 25 వంటి వాటిపై భారీ రాయితీలు ప్రకటించింది. సేల్ కొనసాగనున్న మూడు రోజులు రూపాయి ఫ్లాష్ సేల్, మిస్టరీ బాక్స్ సేల్ కూడా నిర్వహించనుంది. ఎంఐ డాట్ కామ్, ఎంఐ హోం, ఎంఐ స్టోర్‌లలో సేల్ కొనసాగనుంది.

పోకో ఎఫ్1 6జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్ ధరను రూ.22,999 నుంచి రూ.20,999కి తగ్గించింది. రెడ్‌మీ నోట్5 ప్రొ 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ వేరియంట్, 6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరలు వరుసగా రూ.10,999, రూ.11,999కి తగ్గించింది. వీటి అసలు ధరలు వరుసగా రూ.12,999, రూ.13,999. రెడ్‌మీ నోట్ 6 ప్రొ 4జీబీ+64 జీబీ ధరను రూ. 3 వేలు తగ్గించి రూ.10,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇటీవలే లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రొ, రెడ్‌మీ గో స్మార్ట్‌ఫోన్లను కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 4న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న ఈ సేల్‌లో రెడ్‌మీ 6, రెడ్‌మీ 6 ప్రొ, రెడ్‌మీ 6ఎతో పాటు పలు ఫోన్లు రాయితీలపై లభించనున్నాయి. ఎంఐ కాంపాక్ట్ బ్లూటూత్ స్పీకర్ 2 (రూ.699), ఎంఐ ఇయర్‌ఫోన్స్ (రూ.599), ఎంఐ బాడీ కాంపోజిషన్ (రూ.1,499), ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2ఎస్ (రూ.8,499), ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్ (రూ.999) లను సేల్‌లో భాగంగా లిస్ట్ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసే వారికి రూ.500 తక్షణ డిస్కౌంట్ లభించనుంది. మొబిక్విక్ వినియోగదారులకు 15 శాతం తక్షణ మొబిక్విక్ సూపర్ క్యాష్ లభిస్తుంది. ఈ సేల్ మొత్తం ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా గరిష్టంగా రూ.2 వేల వరకు లభిస్తుంది.

The post రూపాయి ఫ్లాష్ సేల్‌తో వచ్చేస్తున్న షియోమీ.. మూడు రోజులపాటు ఆఫర్లు appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2UmwMj1

No comments:

Post a Comment