etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, April 1, 2019

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన డైరెక్టర్స్, ఆ డైరెక్టర్స్ ఎవరో తెలుసా ….?

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు.. ఏపీలో అధికారం చేజిక్కుంచుకోవాలని అన్ని నియోజక వర్గాల్లో జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 10 రోజుల సమయమే ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు తమ తమ అస్త్రాలను సిద్ధం చేసుకుని ప్రజల్లో మమేకమైపోతున్నారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో నాయకులూ తమ బహిరంగ సభలతో ప్రజల్లో చైతన్యం నింపుతూ అధికారంలోకి రావాలని ఎవరికీ వారు హామీలు కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ముందుకెళుతోంది. ఇకపోతే త‌మ్ముడు పవన్ కళ్యాణ్‌కి అండ‌గా అన్న‌య్య నాగబాబు రంగంలోకి దిగిన విషయ తెలిసిందే. పవన్ సమక్షంలో అయన జనసేనలో చేరి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

కాగా జనసేనలో‌కి దర్శకులు రమేష్ మరియు గోపి‌ (తరుణ్ ‘ఇది నా లవ్ స్టోరీ’ చిత్ర దర్శకులు) చేరారు. నాగబాబు సమక్షంలో ఈరోజు (సోమవారం) వారు జనసేన కండువా కప్పుకున్నారు. ఇకపై పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటామని, జనసేన విజయానికి తమ తోడ్పాటును అందిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

The post నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన డైరెక్టర్స్, ఆ డైరెక్టర్స్ ఎవరో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2OC9ctn

No comments:

Post a Comment