etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, April 3, 2019

దీనంతటికీ కారణం చైతూనే.. ఆయన చెప్తేనే చేశా: సమంత

పెళ్లి తర్వాత సమంత సినిమాల జోరు పెరిగింది. వరుస సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న సమంత ఇటీవలే ‘సూపర్ డీలక్స్’ అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో బోల్డ్‌గా కనిపించే ‘వేంబు’ పాత్రలో నటించిన సామ్.. యువ హృదయాలను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హిజ్రాగా నటించగా, రమ్యకృష్ణ వేశ్య పాత్ర పోషించింది. ఈ సినిమా విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకుంటోంది.

కాగా తన పాత్ర విషయమై తాజాగా మీడియాతో మాట్లాడిన సమంత పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ‘‘నేను చేసిన వేంబు పాత్రపై ఎలాంటి విమర్శలొస్తాయో అని అనుకున్నా. కానీ ఈ పాత్రకు ప్రశంసలు దక్కడం ఆనందంగా ఉంది. అయితే ఈ పాత్రకు ఇంత పేరు రావడానికి కారణం నాగచైతన్యనే. ఈ రోల్ గురించి చైతూతో చెప్పినప్పుడు.. ఆయన చాలా ప్రోత్సహించారు. అందుకే ఇప్పుడొస్తున్న క్రెడిట్ అంతా చైతుకే చెందుతుంది. ఇక సినిమా హిట్ అని తెలియగానే మామయ్య నాగార్జున కూడా చాలా సంతోషపడి నాకు ఫోన్ చేసి అభినందించారు. ఈ విజయం నాకు చాలా ప్రత్యేకమైంది. ఇక నుంచి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తా’’ అని చెప్పింది సమంత.

The post దీనంతటికీ కారణం చైతూనే.. ఆయన చెప్తేనే చేశా: సమంత appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2Ia1iGz

No comments:

Post a Comment