పేదల జీవితాలలో వెలుగులు నింపడానికి రాజన్న రాజ్యం రావాలంటే అది జగనన్నతోనే సాధ్యమని సినీ నటుడు, వైసీపీ నాయకుడు ఆలీ అన్నారు. మండలంలోని శేరిఖండం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆలీ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ వైఎస్ అమలు చేసిన పథకాలు నేటికీ ప్రజల హృదయాలలో గూడుకట్టుకొని ఉన్నాయన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం అలవాటు లేని జగన్ రాకతో అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ప్రజల ఆశీర్వచనాలను జగన్‌కు అందించి ఎంవీవీ సత్యనారాయణను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి, ఆవంతి శ్రీనివాసరావును ఎమ్మెల్యేగా గెలిపించి అమరావతికి పంపించాలని ఆయన మహిళలకు విజ్ఙప్తి చేశారు.
విశాఖ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్‌కు పట్టం కడితే బడుగు, బలహీన వర్గాలతో పాటు రైతులు, కూలీలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి అవసరమైన పథకాలు అందుతాయన్నారు. భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజకీయాలకు జన్మనిచ్చిన భీమిలి నియోజక వర్గమంటే తనకు ఎంతో ఇష్టమని అందుకే ఇక్కడ పోటీచేస్తున్నానన్నారు. పద్మనాభంలో డిగ్రీ కళాశాలతో పాటు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు.
ఈసభకు వివిధ గ్రామాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో వైసీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరీ, ఆవంతి శ్రీనివాసరావు, సతీమణి జ్ఞానేశ్వరి, కుమార్తె ప్రియాంక, వైసీపీ మండల అధ్యక్షుడు కె.రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి ఎస్.గిరిబాబు, పార్టీ నాయకులు డి.గోపీబాబు, ఎం.అప్పలనాయుడు, అముజూరు అప్పారావు, కోరాడ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
The post ఆయనకు.. మాట తప్పే అలవాటు లేదు, శేరిఖండం ప్రచార సభలో సినీ నటుడు ఆలీ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2I59R5o
No comments:
Post a Comment