ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ‘మన్కడింగ్’ వివాదం రచ్చ లేపగా.. తాజాగా మరో నిబంధన తీవ్ర చర్చనీయాంశమైంది. ‘బంతి వికెట్లను తాకినా బెయిల్స్ కింద పడితేనే బ్యాట్స్‌మన్ అవుట్’ అనే నిబంధనపై క్రీడా పండితులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా మూడు సంఘటనలు జరగడంతో ఈ నిబంధన తొలిగిస్తే మంచిదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొట్టి ఫార్మట్‌లో నిబంధనలు బౌలర్‌కు అనుకూలంగా ఉండాలని వారు పేర్కొంటున్నారు.
తాజాగా ఈ నిబంధనపై ఇంగ్లండ్ మాజీ సారథి మైకెల్ వాన్ స్పందించాడు. ‘బౌలర్ వేసిన అద్భుత బంతి బ్యాట్స్‌మన్‌ను తప్పించుకుంటూ వికెట్‌ను తాకింది. అయితే కేవలం బెయిల్స్ పడనంత మాత్రానా బ్యాట్స్‌మన్ అవుట్ కాదని ఆనడం హాస్యాస్పదం. ఈ నిబంధన తీసేస్తేనే క్రికెట్‌కు మంచిది’అంటూ వాన్ పేర్కొన్నాడు. ఈ నిబంధనతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎక్కువగా నష్టపోయింది రాజస్తాన్ రాయల్స్ జట్టు.
ఆదివారం కోల్‌కతా-రాజస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్బంగా.. క్రిస్‌లిన్ బ్యాటింగ్ చేస్తుండగా ధవల్ కులకర్ణి వేసిన నాలుగో ఓవర్ రెండో బంతి.. వికెట్లను తాకింది. కానీ బెయిల్స్ కిందపడలేదు. విచిత్రంగా ఆ బంతి బౌండరీ వెళ్లింది. దీంతో క్రిస్‌లిన్ బతికిపోగా.. కోల్‌కతాకు నాలుగు పరుగులు లభించాయి. ఇక ఆ సమయంలో క్రిస్‌లిన్ కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దొరికిన ఈ అవకాశంతో చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
The post బాల్ తగిలినా బెయిల్స్ కిందా పడటం లేదు, క్రికెట్‌లో ఆ నిబంధన తీసేస్తే సరి? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2OX5XwX

No comments:
Post a Comment