జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం రోజున విజయనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని అయోధ్య మైదానంలో జరిగిన ప్రచార సభలో అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడుతుండగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ ప్రసంగిస్తుండగా స్టేజ్ వెనుక భాగం నుంచి వచ్చిన ఓ అభిమాని ఆయన కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. రెండు కాళ్లు పట్టుకోవడంతో పట్టు కోల్పోయిన పవన్ ఒక్కసారిగా కిందపడిపోయారు. కాగా ప్రచార సభ మొదలైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.
పవన్ పట్టుకుని ఉన్న మైక్ కూడా విరిగిపోయింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పవన్‌ను పైకి లేపారు. వెంటనే ఆ అభిమానిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి పవన్ యథావిథిగా ప్రసంగాన్ని ప్రారంభించారు. కాగా పలు సభల్లో పవన్ కోసం అభిమానులు స్టేజ్‌పైకి పరుగులు తీసి రావడం, ఆయన్ను హత్తు కోవడం.. పాదాభివందనం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవాళ జరిగిన హఠాత్పరిణామంతో సభికులు, కార్యకర్తలు, అభిమానులు ఒకింత అవాక్కయ్యారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
The post అభిమాని చేసిన నిర్వాకానికి అదుపు తప్పి స్టేజి పై పడిపోయిన పవన్ కళ్యాణ్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2G1r12a
No comments:
Post a Comment