etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, April 14, 2019

వేలాడే వంతెన‌పై స్టంట్స్‌.. కూలిన వంతెన‌.. నీటిలో పడిపోయిన టూరిస్టులు.. వీడియో

వేలాడే వంతెన మీద నడవాలంటే ఇప్పటికీ భయపడేవారు ఉన్నారు. ఎందుకంటే.. అది ఊగుతుంటే వీళ్లకు వణుకు పుడుతుంది. అది ఎక్కడ కూలిపోతుందేమనని. దాని మీద న‌డవాలంటేనే భ‌య‌ప‌డే జ‌నాలు.. దాన్ని ఊపితే ఇంకేమ‌న్నా ఉందా? తాజాగా వేలాడే వంతెన నిజంగానే కూలిపోయింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకున్నది. సుయినింగ్ దేశంలోని జియాంగ్సులో ఉన్న టూరిస్ట్ స్పాట్‌లో ఉన్న వేలాడే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చెక్కలతో చేసిన ఆ వేలాడే వంతెనపై పదుల సంఖ్యలో టూరిస్టులు నడుస్తున్నారు. అకస్మాత్తుగా ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో బ్రిడ్జిపై ఉన్న టూరిస్టులంతా కింద ఉన్న నీటిలో పడిపోయారు. అయితే.. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే.. ఇటీవల వేలాడే వంతెనల మీద ఫన్‌గా ఆటాడుకోవడం అలవాటుగా మారిందట చైనాలో. వేలాడే వంతెనల మీదికి వెళ్లి దాన్ని అటూ ఇటూ ఊపుతూ ఎంజాయ్ చేస్తున్నారు చైనీయులు. ఈ వంతెనపై కూడా కొంద‌రు టూరిస్టులు అలాగే చేయబోయారు. కానీ.. అది వాళ్లకే రివర్స్ అయింది. వాళ్ల ఊపుడును తట్టుకోలేని బ్రిడ్జ్ కూలిపోయింది.

గత సంవత్సరం కూడా ఇలాగే చైనాలో పాదాచారుల వంతెన కూలిపోయింది. టూరిస్టులు ఆ వంతెన మీద నడుస్తుండగా అది కూలిపోయింది. అయితే ఆ బ్రిడ్జి మీదినుంచి రాకపోకలను ఆపేసినా.. టూరిస్టులు ఆ బ్రిడ్జి మీది నుంచి వెళ్లే సరికి వాళ్ల బరువును ఆపలేక ఆ బ్రిడ్జి కూలిపోయింది.

The post వేలాడే వంతెన‌పై స్టంట్స్‌.. కూలిన వంతెన‌.. నీటిలో పడిపోయిన టూరిస్టులు.. వీడియో appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2IxZM10

No comments:

Post a Comment