ఆల్కహాల్ తాగితే మత్తు వస్తుందనే అందరికీ తెలుసు. కాని మద్యంలో ఉపయోగించే ఆల్కహాల్ ను ఇంట్లో వినియోగించి అనేక సమస్యల నుంచి పరిష్కారాలు పొందవచ్చు. ఆల్కహాల్ ను రుద్దితే అది క్రిమి సంహారిణి గా పనిచేస్తుంది. దీనివలన ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయని చాలా మందికి తెలీదు. ఆల్కహాల్ ను కాస్మొటిక్స్ లో కూడా ఉపయోగిస్తారు.
నల్లులను చంపుతుంది:
చాలా ఇళ్ళల్లో నల్లుల సమస్య బాదిస్తుంటుంది. ఒక బాటిల్ లో ఆల్కహాల్ తీసుకొని మంచాలపై, పరుపులపై చల్లితే నల్లుల నుంచి ఉపశమనం పొందవచ్చు. నల్లులు పెట్టే గుడ్లు చనిపోతాయి. కొద్ది రోజులు ఇలా చల్లితే నల్లుల బారినుండి పూర్తిగా విముక్తి పొందవచ్చు.
డియోడరెంట్ గా వాడుకోవచ్చు:
ఆల్కహాల్ డియోడరెంట్ గా కూడా వాడుకోవచ్చు. శరీరం నుంచి వచ్చే దుర్వాసన వలన మొదలయ్యే బాక్టీరియాను చంపుతుంది. అయితే ఇది తాత్కాలికంగా మాత్రమే ఉపయోగించాలి లేకపోతె చర్మ సంబందిత అలర్జీలు వస్తాయి.
ఇంట్లో తయారు చేసే కూల్ ప్యాక్:
ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని రెండు భాగాలు నీరు, ఒక భాగం ఆల్కహాల్ వేసి సీల్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే కూల్ ప్యాక్ తయారవుతుంది. దీన్ని శరీరంలోని దెబ్బలకు ఉపశమనం లా ఉపయోగించవచ్చు.
పేను నిర్మూలించేందుకు:
ఆల్కహాల్ కు లావెండర్ నూనె ని కలిపి తలపై జుత్తు మీద చల్లుకుంటే తలలో ఉన్న పేలను నిర్మూలించవచ్చు. ఆ తరువాత తలను దువ్వుకుంటే చనిపోయిన పెలన్నీ బయట పడతాయి.
చెవులను శుభ్రపరుస్తుంది:
చాలా మంది తమ చెవులను శుబ్రపరుచుకునేందుకు కాటన్ బడ్స్ వాడుతుంటారు. అయితే దాని బదులు వెనిగర్ ఆల్కహాల్ మిశ్రమం ఒక కప్ లో తీసుకొని చెవిలో వేసుకుంటే చెవిని శుబ్రపరచుకోవచ్చు.
The post పడుకునే ముందు మంచం మీద ఇలా ఆల్కహాల్ చల్లితే ఎన్ని ఆరోగ్య ప్రయేజనాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Drdv6s


No comments:
Post a Comment