మార్కెట్‌లలో పుష్కలంగా దొరికే ముల్లంగితో అనేక ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. దీనిని కూరల్లో, సాంబారులో, సలాడ్లలో ఎలా తీసుకున్నా శరీరానికి మేలు చేసే పోషకాలెన్నో అందుతాయి.
మహిళలకు మూత్ర సంబంధ సమస్యలు తరచుగా తలెత్తుతుంటాయి. అలాంటి వారు ముల్లంగిని తరచుగా తీసుకోవడం మంచిది. మూత్ర సమస్యలు, మంట, వాపు వంటివి అదుపులో ఉంటాయి. మూత్రపిండాల్లోని ఇన్‌ఫెక్షన్‌ను దూరం చేయడమే కాదు వ్యర్థాలను మూత్రం ద్వారా వెళ్లిపోయేలా చేస్తుంది. బరువుతగ్గాలనుకునేవారికి ముల్లంగి భేషైన ఔషధం. ఇందులో పీచు అధికం. క్యాలరీలు తక్కువ. ముల్లంగిని కొంచెం తీసుకున్నా కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. ముల్లంగిలో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇది మలబద్దకం వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. జీవ క్రియల రేటును వృద్ధి చేస్తుంది. ముల్లంగిలో విటమిన్ సి ఫోలిక్ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.
ముల్లంగిలో ఎక్కువగా ఉండే యాంటి ఆక్సిడెంట్లు శరీరంలో క్యాన్సర్లకు కారణమయ్యే కారకాలతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి. శరీరానికి మేలు చేసే కొత్త కణాల ఉత్పత్తికి ముల్లంగి తోడ్పడుతుంది. ముల్లంగిని తరచుగా తీసుకునేవారికి అల్సర్ సమస్య తగ్గిపోతుంది. శరీరంలో రక్త ప్రసరణ చురుగ్గా ఉంటుంది. ముల్లంగితో చర్మ సంబంధమైన సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ముల్లంగిలో ఉండే విటమిన్ బి, జింక్, ఫాస్పరస్, నీరు చర్మం నిర్జీవంగా మారకుండా కాపాడతాయి.
The post ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిస్తే ముల్లంగిని ఎవ్వరూ తినకుండా వదలరు…! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2ITn29X
No comments:
Post a Comment