etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, April 4, 2019

అమ్మా.. ధోనికే మన్కడింగా? అంత సీన్ లేదు, వైరల్ వీడియో

మన్కడింగ్‌.. తాజా ఐపీఎల్‌ సీజన్‌లో రచ్చలేపిన అంశం. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ విధానంలో ఔట్‌ చేయడంతో​ ఈ నిబంధనపై తీవ్ర చర్చనీయాంశమైంది. అశ్విన్‌ క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని మాజీ క్రికెటర్లు, అభిమానులు, క్రీడా విశ్లేషకులు దుమ్మెత్తిపోసారు. అయితే ఈ తరహా ఔట్‌ క్రికెట్‌ నిబంధనల్లో ఉన్నప్పటికి.. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఉందని తీసేయాలనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. గతంలో చాలా సార్లు ఈ తరహాలో తీసినప్పటికి.. కొందరు క్రీడా స్పూర్తితో బ్యాట్స్‌మన్‌ను వెనక్కి పిలిచిన సందర్భాలు ఉన్నాయి.

అయితే తాజాగా మరోసారి మన్కడింగ్‌ పదం చర్చనీయాంశమైంది. గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు కృనాల్‌ పాండ్యా ఈ తరహా ఔట్‌కు ప్రయత్నించాడు. కానీ చెన్నై ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోని ఆ అవకాశం ఇవ్వలేదు. కేదార్‌ జాదవ్‌కు బంతి వేయాల్సిన కృనాల్‌ ఒక్కసారిగా ఆగి నాన్‌స్ట్రైకర్‌ ధోనిని హెచ్చరించాడు. కానీ ధోని తన బ్యాట్‌ను క్రీజులోనే ఉంచి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ సందర్భంగా కామెంటేటర్స్‌ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ధోని తన 15 ఏళ్ల కెరీర్‌లో మైదానంలో ఏ మాత్రం అలసత్వంగా ఉండలేదని, అది వికెట్ల వెనుకాలనైనా.. క్రీజులోనైనా అని వ్యాఖ్యానించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుండగా.. అమ్మా..ధోనికే మన్కడింగా అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

The post అమ్మా.. ధోనికే మన్కడింగా? అంత సీన్ లేదు, వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2TVMhKB

No comments:

Post a Comment