బ్లాక్బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ అనూహ్యం గా అందరికీ షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రచారం చేయడమే కాకుండా కాంగ్రెస్ అధికారం లో కి రాకపోతే పీక కోసుకుంటాను అని కూడా షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఆయన కి అసెంబ్లీ టికెట్ వస్తుంది అని ఆశించాడు కానీ హై కమాండ్ మాత్రం ఆయనని నిరాశ పరిచింది. అయినప్పటికి ఆయన పార్టీ కోసం పని చేసాడు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యం లో గణేష్ ప్రచార పర్వం లో ఎక్కడా కూడా కనిపించడం లేదు. అంతే కాకుండా అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై కూడా చెప్పారు అనే విషయం వెలుగు లో కి వస్తుంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ ఆయన నేడు వేసిన ఒక ట్వీట్ అంతటా కలవరం లేపుతుంది. “నిజాయితీ కి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు.
నా దైవం, నా బాస్. పవన్ కల్యాణ్ గారిని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి. మీ బండ్ల గణేష్.” అని ఆయన ఈ రోజు పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ ఇంకో పార్టీ వ్యక్తి ముఖ్యమంత్రి కావలి అని పోస్ట్ చెయ్యడం ఎంత వరకు కరెక్ట్ అని ఆయన మీద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. దీని పై ఆయన ఏమంటాడో చూడాలి.
The post పవన్ కళ్యాణ్ సీఎం కావాలి… రూటు మార్చిన బండ్ల గణేశ్ ? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2CWvyB7
No comments:
Post a Comment