etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, April 20, 2019

రెండో పెళ్లి చేసుకున్న భర్తను అందరిముందే ఉతికి ఆరేసినా మొదటి భార్య.

మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడిని ఉతికి ఆరేశారు. విడాకులు ఇవ్వకుండా, మరదలిని పెళ్లి చేసుకున్న అతగాడిని మొదటి భార్య అందరి ముందు దేహశుద్ది చేసింది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన సాంబశివరావుకు నాలుగేళ్ల క్రితం శైలజతో వివాహం అయింది. అయితే ఆమెకు పిల్లలు పుట్టడం లేదని వేధింపులకు గురి చేయడంతో భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సాంబశివరావు భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శైలజ తన బంధువులతో కలిసి భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకూ అక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

The post రెండో పెళ్లి చేసుకున్న భర్తను అందరిముందే ఉతికి ఆరేసినా మొదటి భార్య. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2Gm7bhc

No comments:

Post a Comment