etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 3, 2019

కువైట్: 9నెలల తర్వాత క్షేమంగా ఇళ్లు చేరిన ఉద్యోగులు | ​9 Employees returned safely to their home, after 9 Months! ​ | Etechlooks

కువైట్: 9నెలల తర్వాత క్షేమంగా ఇళ్లు చేరిన ఉద్యోగులు | ​9 Employees returned safely to their home, after 9 Months! ​ Nri oi-Garrapalli Rajashekhar | Published: Wednesday, October 31, 2018, 15:04 [IST] హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫాబ్రికేటర్ శ్రీనివాస్ పత్రితో పాటు ఇంకా ఎనిమిది మంది కార్మికులు విసిట్ వీసా మీద కువైట్ వచ్చి తొమ్మిది నెలలు కష్టాలు పడి ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు. వీరిలో శ్రీనివాస్‌తోపాటు విశాఖపట్నంకు చెందినవారు ఐదుగురు, ఇద్దరు గుజరాత్‌కి చెందినవారు, కడప జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. వీరు కువైట్‌కు విసిట్ వీసా మీద 9నెలల క్రితం ఉపాధి కోసం వచ్చారు. చివరకు వారి సొంత టిక్కెట్ ఛార్జీలతో అక్టోబరు 25, 29 అక్టోబర్లలో సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. విశాఖ జిల్లాకు చెందిన వారు: సుల్తాన్, వయస్సు 26 వెల్డర్ఇమామాలి, వయస్సు 23 పైప్ ఫిట్టర్అబ్దుల్ ఖదర్ జిలానీ, వయస్సు 25 పైప్ ఫిట్టర్అమీర్ బాషా షేక్ వయస్సు 25 పైప్ ఫిట్టర్నాగూర్ షేక్, వయస్సు 21, పైప్ ఫిట్టర్ కడప జిల్లాకు చెందినవారు:మడిగల్ల గురునాథ్, వైయస్ఆర్ కడప జిల్లా, వయస్సు 25 వెల్డర్ గుజరాత్‌కి చెందినవారు: లలిత్ కుమార్ రాంజీ భాయ్ టండెల్, వయస్సు 33 పైప్ ఫిట్టర్మినేష్ కుమార్ ధన్సుఖ్భాయ్ టాండెల్, వయస్సు ౩౦ వెల్డర్ శ్రీనివాస్ వారి గ్రామస్తుడు గణేష్, అతని మామ జనార్ధన్‌కు వివరాలను మురళీధర్ రెడ్డితో పంచుకుని వీరికి తోడ్పడమని చెప్పగా మురళీధర్ వారికి రాయబార కార్యాలయానికి చేరమని సూచించారు. వారి ఫిర్యాదును నమోదు చేయడానికి అంబాసిని సహాయం చేయమని కోరారు. ఎంబసీ వారికి సహాయం చేసింది. ఎంబసీ ప్రెస్ ఫిర్యాదు No.1266.. తేదీ 26 జూన్, 18న ఈ ఉద్యోగులకు 4 నెలలు ఎంబాసి ఆశ్రయం కూడా ఇచ్చింది. అంతేగాక వారి యజమానితో మాట్లాడి పంపడానికి చాలా ప్రయత్నించింది. చివరకు అలీ సహాయంతో ఇంటికి పంపడం జరిగింది. ఇందులో మురళీధర్ రెడ్డి.. ఇటు శ్రీనివాస్ ఇంటి వారితో, మిత్రులతో అంబాసితో పని జరుగుటకు మాట్లాడటం జరిగింది. ప్రత్యేక కృతజ్ఢతలు అలీకి, అంబాసికి, చిట్టి బాబుకి, శ్రీనివాస్ గ్రామ మిత్రుడు గణేష్,బాబాయ్ జనార్దన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు – రిజిస్ట్రేషన్ ఉచితం! Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Allow Notifications You have already subscribed The post కువైట్: 9నెలల తర్వాత క్షేమంగా ఇళ్లు చేరిన ఉద్యోగులు | ​9 Employees returned safely to their home, after 9 Months! ​ appeared first on Etechlooks. http://bit.ly/2IYustc

No comments:

Post a Comment