జియో అనునది రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఒక అనుబంధ పరిశ్రమ. వీరు అతి చౌకగా భారతదేశంలో మొబైల్ మరియు డాటా సేవలను ఆరంభించి ఈ రంగంలో పోటీకి తెరలేపారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా దేశంలోని 17 పట్టణాల్లో (డైన్అవుట్ సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతాలు) జియో సబ్‌స్క్రైబర్లు వారి తొలి బుకింగ్ ఫీజుపై రూ.100 తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇది కేవలం జియో యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణంగా డైన్‌అవుడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా రెస్టారెంట్లను బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజు చెల్లించాలి. అయితే ఇప్పుడు జియో యూజర్లు బుకింగ్ ఫీజుపై రూ.100 డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే రెస్టారెంట్ బిల్లుపై తగ్గింపు పొందొచ్చు. ఫుడ్, డ్రింక్స్, ఇతర బఫెట్స్‌పై 1+1 ఆఫర్ సొంతం చేసుకోవచ్చు.
రిలయన్స్ జియో తమ ఖాతాదారులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. డైనింగ్ ప్లాట్‌ఫాం అయిన డైన్ అవుట్‌తో జతకట్టిన జియో.. ‘గ్రేట్ ఇండియన్ రెస్టారెంట్ ఫెస్టివల్’(జీఐఆర్ఎఫ్) లో భాగంగా నెల రోజులపాటు ఆఫర్లు ఇవ్వనుంది. దేశంలో డైనింగ్ కల్చర్‌ను ప్రమోట్ చేసేందుకు 2017లో జీఐఆర్ఎఫ్‌ను ప్రవేశపెట్టారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణె, చెన్నై, గోవా సహా డైన్ అవుట్ సర్వీసులు అందుబాటులో ఉన్న దేశంలోని 17 నగరాల్లోని 8 వేల రెస్టారెంట్‌లలో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.
జియో ఆఫర్‌లో భాగంగా డైన్ అవుట్ యాప్ ద్వారా ఆయా రెస్టారెంట్‌లలో టేబుల్ బుక్ చేసుకునే జియో యూజర్లకు తొలిసారి రూ.100 రాయితీ లభిస్తుంది. అలాగే, రెస్టారెంట్ బిల్లుపై రాయితీ కూడా లభిస్తుంది. ఆహారం, శీతలపానీయాలు, బఫెట్స్‌పై 1+1 ఆఫర్‌ను కూడా పొందొచ్చు. రెస్టారెంట్ బిల్లులో జియో యూజర్లకు ఫ్లాట్ 50 శాతం రాయితీ లభిస్తుంది. అయితే, ఇందుకోసం డైన్ అవుట్ కూపన్లను రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మై జియో యాప్‌లోని కూపన్ విభాగంలో ఉంటాయి.
The post ప్రతి జియో యూజర్ తెలుసుకోవాల్సిన 50% ఆఫీర్, లేకుంటే నష్టపోతారు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/317JIJk
No comments:
Post a Comment