etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, May 12, 2019

పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసి ఫోన్ చేసి మరి శుభాకాంక్షలు తెలిపారు – మహేష్ బాబు

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహర్షి సినిమా ఎట్టకేలకు ఇటీవలే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది..విడుదల అయినా టీజర్ ,ట్రైలర్ ని చూసి అందరూ ఊహించినట్టు గానే సినిమా అద్భుతంగా వచ్చింది అని మొదటి ఆట లోనే విపరీతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది..రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన మహేష్ బాబు అభిమానులు థియేటర్స్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు..ఇది ఇలా ఉండగా ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లు మహేష్ బాబు కెరీర్ లోనే హైయెస్ట్ గా నిలిచినట్టు తెలుస్తోంది..గతం లో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కి కలుపుకొని 23 కోట్ల రూపాయిలు వసూలు చేసింది..ప్రపంచ వ్యాప్తంగా 32 కోట్ల రూపాయిలు షేర్ ని వసూలు చేసింది ఆ చిత్రం..

ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ నేడు హైదరాబాద్ లో జరిగింది..ఈ కార్యక్రమానికి యూనిట్ సభ్యులు మాడారు హాజరు అయ్యి ప్రసంగించారు..సూపర్ స్టార్ మహేష్ ఈ చిత్రం విజయం గురించి మాట్లాడుతూ ” నా కెరీర్ లో మహర్షి సినిమాని మర్చిపోలేని సినిమా గా చేసినందుకు వంశి పైడిపల్లి గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను..ప్రేక్షకులకు మరియు అభిమానులకి ఈ చిత్రాన్ని ఇంతటి ఘన విజయం అందించిందాం నేను జీవితం లో మర్చిపోలేను..జీవితాంతం మీ అందరికి రుణ పడి ఉంటాను..అంటే కాకుండా ఈ సినిమా ని చూసి నాకు ఫోను లో శుభాకాంక్షలు తెలిపిన మెగా స్టార్ చిరంజీవి గారికి,పవన్ కళ్యాణ్ గారికి,ఎన్టీఆర్ గారికి ,రామ్ చరణ్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను..ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా చూసి చెప్పిన మాటలను నేను ఎప్పటికి మర్చిపోలేను ” అంటూ మహేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడారు

మొత్తానికి భారీ అంచనాల నడుమ విడుదల అయినా మహేష్ బాబు మహర్షి చిత్రం ప్రేక్షకులను అలరించింది అనే చెప్పాలి..ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబు కామెడీ టైమింగ్ దూకుడు ,ఖలేజా రోజులను గుర్తు చేస్తోంది..ఒక్క పక్క వినోదం ని పంచుతూనే మరో పక్క సెంటిమెంట్ ని కూడా సమంగా పండిస్తూ వంశి పైడిపల్లి సినిమాని నడిపించారు..కానీ సినిమా చాల రొటీన్ గా అనిపించడం తో ఎంత వరుకు ఈ వేసవి లో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపిస్తుందో చూడాలి..కానీ ఆఖరి 40 నిముషాలు సినిమాకి హైలెట్ అనే చెప్పొచ్చు..ఈ చిత్రానికి ప్రధానమైన మైనస్ ఏదైనా ఉందా అంటే అది దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి..మంచి మంచి సన్నివేశాలకు కూడా చాలా బలహీనమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇచ్చాడు..పూజ హెగ్డే ,జగపతి బాబు ఓకే అనిపించినా సినిమాకి మహేష్ బాబు తర్వాత ప్రదమైన బలం ఎవ్వరైనాఉన్నారా అంటే అది అల్లరి నరేష్ అని మాత్రమే చెప్పాలి…తన పాటర్ ఈ సినిమాకి వెన్నుముక లాంటిది..వేసవి కానుకగా వచ్చిన ఈ చిత్రం బో ఆఫీస్ దగ్గర ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి

The post పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసి ఫోన్ చేసి మరి శుభాకాంక్షలు తెలిపారు – మహేష్ బాబు appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2VZw63W
via IFTTT

No comments:

Post a Comment