మన శరీరం రకరకాల ప్రతిస్పందనల ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇస్తుంటుంది. అలాంటి సూచనల్లో మూత్రం రంగు కూడా ఒకటి. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో మూత్రం రంగు మారుతుంది. మారిన మూత్రం రంగు ఎలాంటి అనారోగ్యానికి కారణమో అవగాహన కలిగి ఉండడం అవసరం.
1. ఎరుపు….మూత్రం ఎరుపు రంగులో ఉంటే మూత్రంలో రక్తం కూడా కలిసి వస్తుందని అర్థం. ఇది చాలా సందర్భాల్లో యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ కారణంగా అవుతుంది. లేదా కిడ్నీ లేదా బ్లాడర్‌లో రాళ్లు ఉండడం వల్ల లేదా యూరినరీ ట్రాక్ గాయపడడం లేదా ప్రొస్టేట్ సంబంధిత సమస్యలేమైనా కావచ్చు. చాలా అరుదుగా బ్లాడర్ లేదా కిడ్నీలో క్యాన్సర్ కూడా ఇందుకు కారణం కావచ్చు. మూత్రం ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తం పోకపోవచ్చు. దీన్ని సమస్యకు ఒక సూచనగా భావించవచ్చు.
2.బ్లూ….మూత్రం నీలం రంగులో రావడం.. పసి పిల్లల్లో కనిపించే సమస్య. నవజాత శిశువుల్లో రక్తంలో ఎక్కువగా కాల్షియం ఉండడం వల్ల వారి మూత్ర విసర్జన నీలం రంగులో ఉంటుంది. దీనిని బ్లూ డైపర్ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక జన్యులోపం కారణంగా వచ్చే సమస్య. పెద్ద వారిలో ముఖ్యంగా వయాగ్రా వాడే పురుషుల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తుంది.
3.నలుపు…..కొన్ని రకాల ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల మూత్రం నలుపు రంగులో ఉండేందుకు ఆస్కారం ఉంది. ఒక్కోసారి ఐరన్ లోపం సరిచేసేందుకు వాడే ఇంజక్షన్ల కారణంగా కూడా మూత్రం నలుపు రంగులో రావచ్చు.
4.జేగురు….ఇది సాధారణంగా చర్మం లేదా గొంతులో ఇన్‌ఫెక్షన్ల ప్రభావం కిడ్నీ మీద పడినపుడు ఇలా జరుగుతుంది. ఇలాంటి స్థితి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా దీన్ని నుంచి బయటపడవచ్చు. కానీ చాలా మంది డాక్టర్లు తర్వాత కాలంలో రాబోయే క్రానిక్ కిడ్నీ డిసీజ్‌కు ఇది ఒక సూచనగా భావిస్తారు.
5.ముదురు పసుపు…..మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. డీహైడ్రేషన్‌కు లోనైనపుడు అది ముదురు రంగులోకి మారుతుంది. ఒక్కోసారి లివర్ సమస్యలు, కామెర్ల వంటి సమస్యలున్నపుడు కూడా మూత్రం ముదురు పసుపు రంగులో రావచ్చు. కొన్ని రకాల మందులు వాడుతున్నపుడు కూడా మూత్రం పసుపు రంగులో వచ్చే ఆస్కారం ఉంటుంది.
The post మీ మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉందొ తెలుసుకోవచ్చు, తప్పక తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Yib9ia


No comments:
Post a Comment