చెన్నై సూపర్‌కింగ్స్ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్థానిక ఐటీసీ కాకతీయ హోటల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. హోటల్ వాళ్లు అందించిన ఆహారం, రూమ్ సర్వీస్ అస్సలు బాగోలేదంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో దిగింది. అయితే సీఎస్‌కే బస చేస్తున్న ఐటీసీ హోటల్ సిబ్బంది తీరుపై హర్భజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమను పట్టించుకునే సమయం కూడా హోటల్ సిబ్బందికి లేదని ఎద్దేవా చేశాడు.
హర్భజన్ ట్వీట్‌పై స్పందించిన ఐటీసీ క్షమాపణలు చెప్పింది. వీలైనంత త్వరగా మెరుగైన సేవలు అందిస్తామని ట్వీట్‌లో పేర్కొంది. అయితే ప్రస్తుతం హర్భజన్ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. హర్భజన్‌ను మానసికంగా దెబ్బతీయాలనే ముంబై ఇండియన్సే కుట్ర చేసిందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఫుడ్ బాగోలేకపోతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోకుండా ఈ రచ్చ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో ప్యారడైజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకొమ్మని సలహాలు ఇస్తున్నారు.
The post హర్భజన్ అసంతృప్తి.. ఫ్యాన్స్ అనుమానాలు, దీంతో …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2W0bMj1
No comments:
Post a Comment