etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 3, 2019

సుమలతా మీద నిఘా వేసిన ఇంటలిజెన్స్ అధికారులు, సీఎం మీద ఆరోపణలు, రహస్య భేటీలు! | Intelligence department keeping eye on Sumala

సుమలతా మీద నిఘా వేసిన ఇంటలిజెన్స్ అధికారులు, సీఎం మీద ఆరోపణలు, రహస్య భేటీలు! | Intelligence department keeping eye on Sumalatha on Kumaraswamy’s instruction. ఎన్నికల ప్రచారం మండ్య లోక్ సభ ఎన్నికల ప్రచారం సమయంలో మీడియాతో మాట్లాడిన సుమలత సీఎం కుమారస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇంటలిజెన్స్ వర్గాలతో తన దినచర్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని ఆరోపించారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని నిర్ణయం తీసుకున్న నెల రోజుల నుంచి తాను ఎక్కడికి వెలుతున్నాను, ఎవరితో భేటీ అవుతున్నాను అనే విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా సీఎం కుమారస్వామి సమాచారం సేకరించారని బహిరంగంగా సుమలత ఆరోపించారు. వెంటాడుతున్నారు లోక్ సభ ఎన్నికలు పూర్తి అయినా ఇంటలిజెన్స్ వర్గాలు సుమలత దినచర్యల గురించి ఆరా తీసి సీఎం కుమారస్వామికి అందిస్తున్నారని ఆమె సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్ లో మండ్య జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సుమలత రహస్యంగా భేటీ అయిన వీడియో హల్ చల్ చేస్తోంది. హోటల్ సిబ్బంది హోటల్ లో ఆ వీడియోను ఎలా తీశారు, ఎందుకు విడుదల చేశారు అంటూ సుమలత సన్నిహితులు ఆరా తీస్తున్నారు. సుమలత, మండ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు హోటల్ లో భేటీ అవుతున్న విషయం ముందుగానే పసిగట్టిన ఇంటలిజెన్స్ అధికారులు హోటల్ సిబ్బంది సహాయంతో వీడియో తీయించి సీఎం కుమారస్వామికి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో సుమలత ఇంత వరకూ బహిరంగంగా మాట్లాడలేదు. అసమ్మతి ఎమ్మెల్యేలు కుమారస్వామి అధికారంలో లేకున్నా తన రాజకీయ శత్రువుల మీద ఓ కన్ను వేసి ఉంటారని సమాచారం. అలాంటిది ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న కుమారస్వామి రాజకీయ శత్రువుల మీద నిఘా పెట్టకుండా ఉంటారా ? అనే వాదన ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలోని అసమ్మతి ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారా, ఎప్పుడు ఎక్కడ కలుసుకుంటున్నారు అని పూర్తి సమాచారం ఇంటలిజెన్స్ అధికారుల నుంచి సీఎం కుమారస్వామి వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. The post సుమలతా మీద నిఘా వేసిన ఇంటలిజెన్స్ అధికారులు, సీఎం మీద ఆరోపణలు, రహస్య భేటీలు! | Intelligence department keeping eye on Sumalatha on Kumaraswamy’s instruction. appeared first on Etechlooks. http://bit.ly/2Jcgkfp

No comments:

Post a Comment