etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 24, 2019

జనసేన పార్టీ MLA గా గెలిచినా రాపాక వరప్రసాద్ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు నిన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది

ఇది ఇలా ఉండగా నిన్నటి ప్రజా తీర్పు ఎలా ఉన్న కూడా ,పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ని మాత్రం ఎవ్వరు జీర్ణించుకోలేక పోతున్నారు..ఆయన అభిమానులకే కాదు..యావత్తు సినీ లోకం ని మరియు ప్రత్యర్థులను కూడా పవన్ కళ్యాణ్ ఓటమి శోక సంద్రంలో ముంచి పారేసింది…అయితే జనసేన పార్టీ MLA గా గెలిచినా ఒక్కే ఒక్కడు రాపాక వరప్రసాద్ ఈరోజు మిడియా ముందు మాట్లాడిన మాటలు వింటే ఈ కాలం లో కూడా ఇలాంటి గొప్ప మనుషులు ఉంటారా అనిపిస్తది..ఆయన మాట్లాడుతూ ” దేవుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి కృప తో న్ రాజోలు నుండి జనసేన పార్టీ తరుపున MLA అభ్యర్థిగా గెలుపొందాను..నా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం నన్ను ఎంతో తీవ్రంగా బాధించింది..అయితేనేమి ఆయన సిద్దాంతాలను జనాల్లోకి తీసుకొని పోవడానికి ఎంతో కృషి చేస్తాం..నా తుది శ్వాస వరుకు పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లోని నడుస్తాను.. జై జనసేన ” అంటూ రాపాక వరప్రసాద్ ఎంతో బావోద్వేగంగా మాట్లాడారు

ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది

The post జనసేన పార్టీ MLA గా గెలిచినా రాపాక వరప్రసాద్ మాటలు వింటే ఆశ్చర్యపోతారు appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2K3Fihl
via IFTTT

No comments:

Post a Comment