ఆశ్చర్యాన్ని కలిగించే ఆవిరి శక్తి పుణ్యమా అని మొట్టమొదటి సారిగా కొత్తరకం ప్రయాణం చేసే అనుభూతి వందలాది ప్రజలకు కలిగింది. వేగంగా వెళ్లే సాహస కృత్యంలో భాగస్వాములు కాగలిగామన్న తృప్తితో వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బులయ్యారు. బుస కొడుతూ గర్జిస్తూ ఇంజన్ పరుగులు తీస్తుంటే, ఇళ్ళూ, చెట్లూ వెనక్కి పరుగెత్తడం, దారి పొడవునా గ్రామీణ ప్రజలు ఆశ్చర్య చకితులై చూస్తుండటం, గుర్రాలు తుళ్లిపడటం, ఆవులు అంబా అంటూ తోకలెత్తి దౌడు తీయటం – ఇవన్నీ ప్రయాణీకుల మనసుల్ని ఆహ్లాదపరిచాయి. కొత్తయుగం పుట్టింది. గ్రామాల మధ్య, దేశాల మధ్య ఉండే అంతరం సమసిపోయే తరుణం ఆసన్నమైనది, కాలమూ, దూరమూ వాటిని వేరుచేయలేవు. ” ఇతర రవాణా సౌకర్యాల కంటే రైళ్ళు ఎక్కువ వాడుక లోకి వస్తాయి. ఈ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది.
ఢిల్లీ నుంచి విశాఖ వచ్చే ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు నరకం చూపించింది. శనివారం ఢిల్లీలో బయలుదేరినప్పటి నుంచి రైలులో ఏసీ సమస్య ప్రారంభమైంది. నాగపూర్‌కు వచ్చేసరికి ఈ సమస్య మరింత పెరిగింది. విజయవాడలో కొంతమేర మరమ్మతు చేసినా తాడేపల్లిగూడెం దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో ఏసీ సరఫరా నిలిచిపోయింది. ఆ తర్వాత పవర్‌కార్ పూర్తిగా ఆగిపోవడంతో రైలులోని మొత్తం బోగీలలో ఏసీ సరఫరా నిలిచిపోయింది. దీంతో పాసింజర్ రైలులో ప్రయాణికులు ఆదివారం రాత్రి 9.20 నిమిషాలకు ఇక్కడకు చేరుకున్నారు. విశాఖ-ఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎసీ ఎక్స్‌ప్రెస్ రైలు మొత్తం ఏసీ సదుపాయం ఉంటుంది. ఈ రైలులో అన్ని బోగీలు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కావడంతో నిత్యం సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వేసవి ప్రారంభంతో సమస్య మరింత తీవ్రమైన నేపథ్యంలో వాల్తేర్ డివిజన్ అధికారులు సమస్య పరిష్కారంపై దృష్టిసారించడంలో విఫలమయ్యారు.
కోచ్‌ల నిర్వహణలో అనుభవం లేకపోయినా రైలు నడిపి మరో తప్పిదం చేయడంతో ప్రయాణికులకు నిత్యం నరకం కనిపిస్తోంది. వేసవి కాలం.. అందులో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదుకావడంతో ఏసీ లేకపోతే క్షణం కూడా ప్రయాణికులు ఉండలేరు. అటువంటిది ఎప్పటికప్పుడు తూతూమంత్రంగా మరమ్మతులు చేయడంతో ఇబ్బంది వస్తోందని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. శనివారం నుంచి ఆదివారం విశాఖ వచ్చేంతవరకు నరకం చూశామని మిలట్రీ డాక్టర్ రాహుల్‌శర్మ ఆరోపించారు. ఏసీ పనిచేయడం లేదని చెప్పినా పెద్దగా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఆగ్రా నుంచి ఇబ్బంది ఎదుర్కొన్నామని మనోజ్‌వర్మ అనే ప్రయాణికుడు వాపోయాడు. రైలు నిర్వహణ చేతకాకపోతే రద్దు
చేయాలని ఇదే రైలులో ప్రయాణించిన పలువురు ప్రయాణికులు ఆరోపించారు. పిల్లలు, మహిళలతో ప్రయాణించే వారంతా ఏసీ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ రైలు మార్గం మొత్తం వేడి ప్రాంతం కావడంతో రైలులో ఉండలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఫిర్యాదు చేస్తే తూతూమంత్రంగా మరమ్మతు చేసినా రాజమండ్రికి వచ్చేసరికి పూర్తిగా మొరాయించింది. ఆదివారం మధ్యాహ్నం 2.20కు రాజమండ్రి వచ్చాక రైలును పూర్తిగా నిలిపివేశారు. అక్కడ ప్రయాణికులు గట్టిగా నిలదీస్తే సాయంత్రం ఆరు గంటల సమయంలో పాసింజర్ రైలు వేశారని కొందరు ప్రయాణికులు పేర్కొన్నారు. రాజమండ్రి నుంచి నాన్ ఏసీ రైలు ఏర్పాటుచేయడంతో ప్రయాణికులకు రిఫండ్ ఇచ్చారు. సుమారు 200 మంది ప్రయాణికులు ఉసూరుమంటూ విశాఖ చేరుకున్నారు.
The post ఎండలు ఎక్కువగా ఉన్నాయ్ అని AC రైలు ప్రయాణం చెయ్యాలి అనుకుంటున్నారా …! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Wr7ldd
No comments:
Post a Comment