etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, July 9, 2019

జపాన్‌లో ఒక్క గుత్తి ఎర్ర ద్రాక్ష ఖరీదు 12 లక్షల యెన్లు. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ….?

ప్ర‌స్తుతం మార్కెట్‌లో మ‌న‌కు ద్రాక్ష‌ల్లో అనేక రకాల ద్రాక్ష‌లు అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా త‌మకు న‌చ్చిన ర‌కానికి చెందిన ద్రాక్ష‌ల‌నే కొని తింటుంటారు. అయితే ప్ర‌ధానంగా ఎరుపు రంగు ద్రాక్ష పండ్ల‌ను తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇత‌ర రంగు ద్రాక్ష‌ల క‌న్నా ఎరుపు రంగు ద్రాక్ష‌ల్లోనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల‌ శ‌రీర క‌ణ‌జాలం నాశ‌నం కాకుండా ర‌క్షిస్తాయి. ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వాపులు పోతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. కీళ్ల నొప్పులు, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే అల్జీమ‌ర్స్ వ్యాధి రాకుండా అడ్డుకోవ‌చ్చు. ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను నిత్యం తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

అయితే పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం అందరికీ తెలిసిందే! వైద్యులు కూడా ప్రతీరోజు పండ్లు తినాలని సూచిస్తుంటారు. మరి అలాంటి పండ్ల ధరలు ఆకాశాన్ని అంటితే ఎవరైనా కొనగలరా? జపాన్‌లో ఒక్క గుత్తి ఎర్ర ద్రాక్ష ఖరీదు 12 లక్షల యెన్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 7.8 లక్షలు. అత్యంత ఖరీదైన ఈ ద్రాక్ష పేరు ‘రూబీ రోమన్’. ఆకారంలో సాధారణ ద్రాక్షకన్నా పెద్దగా ఉండి, ఎంతో తీయగా ఉంటుంది. ఒక్కో ద్రాక్షపండు 20 గ్రాముల కన్నా అధిక బరువుతో ఉంటుంది. ఈ ప్రత్యేకమైన ద్రాక్షను జపాన్‌లోని ఇష్కావ్ ప్రాంతంలో పండిస్తున్నారు. ఇష్కావ్ సహకార సమితి ఈ ద్రాక్షను సాగుచేస్తోంది. కనాజావా మార్కెట్‌లో ఈ ద్రాక్ష గుత్తిని వేలం వేయగా ఒక బడా కంపెనీ 12 లక్షల యెన్‌లకు సొంతం చేసుకుంది. కాగా ఇష్కావ్ సహకార సమితి రాబోయే సెప్టెంబరు నాటికి 26 వేల ద్రాక్ష గుత్తులను పండించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

The post జపాన్‌లో ఒక్క గుత్తి ఎర్ర ద్రాక్ష ఖరీదు 12 లక్షల యెన్లు. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/30qJbSw

No comments:

Post a Comment